బాబు ఫోకస్ అదేనట...సూపర్ సిక్స్ కూడా ?
సంస్కరణలను అమలు చేసి అయినా ఓల్డ్ ట్రెండ్ నుంచి రాష్ట్రాన్ని ముందుకు తేవాలని.;

ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదే ఆయన డెవలపమెంట్ కి అంబాసిడర్. ఆయన అభివృద్ధి కాముకుడు. ఆయన 45 ఏళ్ళ వయసులో సీఎం అయ్యారు. ఆనాటి నుంచి ఆయన పంతం పట్టుదల అంతా టోటల్ చేంజ్ చేయాలని వ్యవస్థలో మార్పు తీసుకుని రావాలని. సంస్కరణలను అమలు చేసి అయినా ఓల్డ్ ట్రెండ్ నుంచి రాష్ట్రాన్ని ముందుకు తేవాలని.
ఆ విషయంలో ఆయన 1995 నుంచి 2004 వరకూ అదే విధంగా వ్యవహరించారు. కాదేదీ ఉచితం అన్నది కూడా అప్పట్లో బాబు ఫిలాసఫీ. చేపలు పట్టడం నేర్పాలి కానీ జనాలకు రోజూ తెచ్చి ఆకలి తీర్చడం కాదు అన్నదే విధానం. అయితే జనాలలో ఉన్న పధకాల మీద ఆసక్తిని ప్రత్యర్థి పార్టీలు ఎప్పటికపుడు సొమ్ము చేసుకోవడంతో రాజకీయంగా ఇబ్బందిపడుతున్నామని గ్రహించే బాబు గేర్ మార్చారు.
అలా ఆయన 2009లో ఆల్ ఫ్రీ అన్న నినాదం అందుకున్నారు అప్పటి రాజకీయ సమీకరణలు బట్టి అధికారం దక్కకపోయినా 90కి పైగా సీట్లు ఉమ్మడి ఏపీలో లభించాయి. ఇక విభజన ఏపీలో చూస్తే 2014లో పెద్ద ఎత్తున ఉచిత హామీలు ఇచ్చారు. ఆ విధంగా జనాలను కన్వీన్స్ చేసి మరీ అధికారం అందుకున్నారు.
అయితే ఈ టెర్మ్ లో బాబు ఉచిత హామీలలో వీలైనవి చేశారు. కానీ ఆయనకు 2019 ఎన్నికలు మాత్రం చేదు ఫలితాలు ఇచ్చాయి. ఇక 2024లో ఆయన సూపర్ సిక్స్ అని ముందుకు వచ్చారు. అయితే ఈసారి కూడా బాబు ఫోకస్ అమరావతి రాజధాని పరిపూర్తి మీద అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయడం మీద ఉంది అని అంటున్నారు.
ఈ రెండు బాబు డ్రీమ్ ప్రాజెక్టులుగా మారిపోయాయి. వీటిని కనుక పూర్తి చేస్తే తాను చరిత్రలో నిలుస్తాను అన్నది బాబుకు ఉంది. అంతే కాదు ఏపీ కూడా శాశ్వతంగా అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందని ఏపీకి ఎదురు ఉండదని బాబు విశ్వాసం. అపుడు ఏపీలో పేదలు కూడా ఉండరని అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నదే ఆయన ఆలోచన.
నిజానికి బాబు ఆలోచనలు కరెక్ట్. కానీ ఏపీలో చూస్తే సూపర్ సిక్స్ మీద రూరల్ సెక్టార్ జనాలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వారికి కావాల్సింది చేతిలో నగదు పడడం. జగన్ వారికి అలా అలవాటు చేశారు. ఏపీలో తరచూ పండుగలు వస్తాయి. ప్రతీ పండుగ ముందు నగదు చేతిలో ఆడితే తమకు తిరుగు ఉండదని వారి భావన.
అయితే అభివృద్ధి చేయడానికి ఎంతో సమయం పడుతుంది. అలాగే వాటి ఫలితాలు కూడా వెంటనే రావు. ఈ రోజున హైదరాబాద్ ఎంతో మందికి ఆశ్రయం ఇస్తోంది అంటే ఆనాటి నుంచి చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి. మరి ఏదో నాటికి ఏపీ కూడా ఆ విధంగా మారాలన్నది బాబు ఆలోచన.
అయితే రాజకీయ అనివార్యతల వల్లనే ఆయన కూడా ఉచితాల విషయంలో కాస్తా తగ్గుతున్నారు అని అంటున్నారు. అనుత్పాదక రంగాల మీద అప్పులు తెచ్చి ఎంత పెట్టినా అది ఏపీకి వడ్డీలనే మిగులుస్తుంది తప్ప మరేమీ ఉండదని బాబు మార్క్ ఆలోచనలు అని చెబుతారు. శాశ్వతమైన అభివృద్ధి కోసం అప్పులు చేసినా తప్పు లేదని అంటారు.
దీంతోనే ఇపుడు కూటమికి రాజకీయంగా కొంత ఇబ్బంది వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ప్రజలు కూడా అభివృద్ధి విషయంలో ఓటేయాల్సి ఉంటుంది. కానీ పధకాల మీద ఉచితాల మీద మోజు పెంచుకుంటే అప్పుల కుప్పగా ఏపీ మారడం తప్ప ఉపయోగం లేదని మేధావులు అంటున్నారు. బాబు చేస్తున్న కార్యక్రమాలకు మేధావుల నుంచి ప్రగతి కాముకుల నుంచి మద్దతు దక్కుతోంది.
సమయంలో పధకాల లబ్దిదారులలో మాత్రం సూపర్ సిక్స్ హామీల విషయంలో అసంతృప్తి ఉంది అని అంటున్నారు. మరి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ పూర్తి స్థాయిలో చేయాలి అంటే అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేయాలి. ఒక దశలో వడ్డీలకే ఏపీ బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. మరి ఈ చిక్కుముడులను ఎలా విప్పుకుని ముందుకు సాగుతారో చూడాలని అంటున్నారు.