బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. గ‌తం-ప్ర‌స్తుతం- నిమిత్త‌మాత్రుడిగా మోడీ!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ సైలెంట్‌గా న‌డుస్తోంది.;

Update: 2024-07-19 15:30 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ సైలెంట్‌గా న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముం దు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఒక‌రి పాల‌న‌పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుం టూ.. లెక్క‌లు తీస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు నాలుగు రోజుల కింద‌ట కేంద్రానికి ఎద్ద నివేదికే అందించారు. ``రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ద‌మ‌న‌కాండ ఇదే!``-అంటూ నివేదిక‌లు స‌మ‌ర్పించారు. అంతేకాదు.. శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేసి.. వాటిని కూడా నివేదిక రూపంలో కేంద్రానికి స్వ‌యంగా ఇచ్చా రు.

గ‌త జ‌గ‌న్ స‌ర్కారు రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింద‌న్నారు. ఇక‌, ఓర‌ల్‌గా చెప్పాల్సిన‌వి కూడా చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం గత ఐదేళ్ల‌లో చేసిన విధ్వంసాలు.. ఇత‌ర ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చంద్ర‌బాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ వంతు వ‌చ్చింది. ప్ర‌ధాని మోడీకి ఆయ‌న లేఖ సంధించారు. 3 పేజీల లేఖ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను జ‌గ‌న్ వివ‌రించారు. దీనిలో 40 రోజుల కూట‌మి పాల‌న‌లో రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఇవే అంటూ.. ఆయ‌న ఓలిస్టును కూడా పేర్కొన్నారు.

``చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టిన కేవ‌లం నెల రోజుల్లోనే 31 మంది హ‌త్య‌కు గుర‌య్యారు. 300 మందిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. అధికార టీడీపీ నేతల వేదింపులు భ‌రించ‌లేక‌.. 35 మంది ఆత్మ‌హ‌త్య చేసుకు న్నారు. 560 మందికి చెందిన ప్రైవేటు ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. 490 ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. 2700 వైసీపీ సానుభూతి ప‌రుల కుటుంబాలు గ్రామాలు వ‌దిలి పెట్టి వెళ్లిపోయారు. అద‌నంగా 1050 విధ్వంసాలు జ‌రిగాయి. దీనిని బ‌ట్టి రాష్ట్రం శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది`` అని ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొన్నారు.

ఇప్పుడు ఏం చేస్తారు?

వాస్త‌వానికి అటు చంద్ర‌బాబు, ఇటు జ‌గ‌న్ ఇద్ద‌రూ త‌మ కీచులాట‌ను కేంద్రం ద‌గ్గ‌ర పెట్టారు. బాగానే ఉం ది. కానీ.. ఇప్పుడు మోడీ ఏం చేస్తారు? అంటే.. మౌనంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఆయ‌న ఏమీ జోక్యం చేసుకునే ప‌రిస్థితి లేదు. ప్ర‌భుత్వ ప‌రంగా.. ఆయ‌న ఏమీ చేయ‌లేరు. శాంతి భ‌ద్ర‌త‌లు రాష్ట్ర జాబితా. ఇక‌, వ్య‌క్తిగ‌తంగా చూసుకున్నా.. బీజేపీకి ఇద్ద‌రూ కావాలి. ఒక‌రు లోక్‌స‌భ‌లో అండ‌గా ఉండి స‌ర్కారు నిల‌బెడుతుంటే.. మ‌రొక‌రు రాజ్య‌స‌భ‌లో అండ‌గా ఉంటున్నారు. దీంతో మోడీ.. కేవ‌లం నిమిత్త‌మాత్రుడే!!

Tags:    

Similar News