చంద్రబాబు కీలక నిర్ణయం.. మరో ఉచిత పథకానికి శ్రీకారం!

ఈ క్రమంలో ఇప్పటికే జూలై 1న పెంచిన పింఛన్లను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు.

Update: 2024-07-03 13:52 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే జూలై 1న పెంచిన పింఛన్లను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.7000 చొప్పున పెన్షన్‌ అందజేశారు. వికలాంగులకు రూ.6 వేలు చొప్పున ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మరో ఉచిత పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హామీని నిలుపుకునే దిశగా చంద్రబాబు అడుగు ముందుకేశారు.

జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ లుæ ఏర్పాటు చేసి, ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం తీవ్ర విమర్శల పాలైంది. వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దండుకున్నారనే విమర్శలు రేగాయి. వైసీపీ ప్రభుత్వ విధానాలతో భవన నిర్మాణ రంగం పడకేసిందనే ఆరోపణలున్నాయి.

Read more!

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2న ఉన్నతాధికారులతో, మంత్రి కొల్లు రవీంద్రతో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గృహనిర్మాణ రంగం రంగం కుదేౖలñ ందన్నారు. ఈ క్రమంలో 2014– 2019 మధ్య, 2019–2024 మధ్య కాలంలో రాష్ట్రంలో అమలులో ఉన్న ఇసుక విధానాలపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల పేరుతో వైసీపీ నేతలు భారీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై హైకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం అధికారం చేపట్టితే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. ఈ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఉచిత ఇసుకను అందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 8 నుంచి పేదలకు ఉచితంగా ఇసుకను అందిస్తారు.

అలాగే గత ప్రభుత్వ విధానంలో ఇసుక అమ్మకాల వల్ల ఎవరికి లబ్ధి కలిగిందో తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ వల్ల ధరలు పెంచడంతో పేదలు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దీనిలో భాగంగా రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు, డంప్‌ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.

వాస్తవానికి 2014–2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసింది. 2019లో జగన్‌ సర్కార్‌ వచ్చిన తరువాత.. ఈ ఉచిత ఇసుక విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది. దీంతో పేదలు, పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది.

Tags:    

Similar News

eac