కేంద్రంలో బాబు పాత్ర కీలకం ?

గత ఎన్నికల్లో కేవలం అయిదారు సీట్లకు పరిమితం అయిన అఖిలేష్ నాయకత్వం లోని ఎస్పీ ఈసారి తారా జువ్వగా ముందుకు దూసుకుని వచ్చింది.

Update: 2024-06-04 06:11 GMT

కేంద్రంలో రాజకీయం మారబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నారు. బీజేపీకి గత రెండు ఎన్నికల్లో ఆదరించిన ఉత్తరప్రదేశ్ ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం అయిదారు సీట్లకు పరిమితం అయిన అఖిలేష్ నాయకత్వం లోని ఎస్పీ ఈసారి తారా జువ్వగా ముందుకు దూసుకుని వచ్చింది.

అదే సమయంలో గతసారి 62 ఎంపీ సీట్లను సాధించి రెండవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీకి ఈసారి యూపీ హ్యాండ్ ఇస్తోంది అని అంటున్నారు. సగానికి సగం ఎంపీ సీట్లు అక్కడ బీజేపీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తునాయి. ఈ నేపధ్యంలో కేంద్రంలో సొంతంగా పూర్తి మెజారిటీని బీజేపీ సాధించే అవకాశాలు కనిపించడం లేదు అని అంటున్నారు.

మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 273 సీట్లను బీజేపీ సాధించడం బహు కష్టం కాబోతోంది. అదే సమయంలో ఏపీలో టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటీలతో ముందు ఉంది. దాంతో టీడీపీ పదహారు ఎంపీ సీట్ల దాకా గెలుచుకునే స్థితిలో ఉంది. అదే కనుక జరిగితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు లో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం అని చెప్పాల్సి ఉంటుంది.

అంతే కాదు ఎన్డీయేలో ఇతర మిత్ర పక్షాల సాయం కూడా తీసుకోవాల్సి ఉండొచ్చు. ఇక ఇండియా కూటమి కనుక 200 సీట్లను పై దాటి వస్తే కనుక జాతీయ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి ఉండవచ్చు అని అంటున్నారు. అదే టైం లో బీజేపీ సొంతంగా 250 మార్క్ సీట్లను సాధించలేకపోతే కేంద్రంలో ఇండియా కూటమికి కూడా అవకాశాలు పెరిగే విధంగా ఉంటాయని అంటున్నారు.

ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక మూడవసారి కేంద్రంలో మోడీ ప్రధాని కావడం అంత ఈజీ టాస్క్ అయితే కాబోదు అని అంటున్నారు. ఇక ఏపీలో అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లు సాధిస్తున్న చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకం అవుతారు అని అంటున్నారు. గత పదేళ్ళుగా పూర్తి మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ఉంది.

దాంతో ఏపీకి సంబంధించి ఏ చిన్న పని కూడా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అలాంటిది ఉండబోదని అంటున్నారు. చంద్రబాబు తనకు ఉన్న రాజకీయ చతురతతో ఢిల్లీలో కూటముల ప్రభుత్వాల ఏర్పాటులో అత్యంత కీలకం అవుతారు కాబట్టి ఆయన పెద్దన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీకి పూర్తి స్థాయిలో మంచి రోజులు వచ్చినట్లే.

విభజన హామీలు ఒకటేమిటి అన్నీ వరసబెట్టి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మారుతున్న ఢిల్లీ రాజకీయం ఏపీలో కొత్త ఆశలను పెంచుతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనే అంటున్నారు.

Tags:    

Similar News