IND vs PAK మ్యాచ్ : క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్..

జియో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ సాధించడంతో ఇది క్రికెట్ హిస్టరీలో ఓ మైలురాయిగా నిలిచింది.

Update: 2025-02-24 05:30 GMT

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ మరోసారి రికార్డులను తిరగరాసింది. హై వోల్టేజ్ మ్యాచ్‌ లలో ఈ పోటీకి ఉన్న క్రేజ్ మరోసారి తేటతెల్లమైంది. జియో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూవర్‌షిప్ సాధించడంతో ఇది క్రికెట్ హిస్టరీలో ఓ మైలురాయిగా నిలిచింది.

 

- ఇండో-పాక్ మ్యాచ్ రికార్డు స్థాయిలో వ్యూస్

ఈ హైపర్ మ్యాచ్‌కు జియో హాట్ స్టార్‌లో ఏకంగా 60.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క మ్యాచ్‌కు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఇంత భారీ వ్యూవర్‌షిప్ రావడం ఇదే తొలిసారి. ఇది కేవలం మ్యాచ్ హైప్ మాత్రమే కాకుండా.. ఆటగాళ్ల ప్రదర్శన వల్ల కూడా సాధ్యమైంది.

 

- ఒక్కో సమయంలో వ్యూయర్‌షిప్ ఎలా పెరిగిందంటే?

మ్యాచ్ ప్రారంభం - మహ్మద్ షమి తొలి ఓవర్ వేయగా వ్యూయర్‌షిప్ 6.8 కోట్లుగా ఉంది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసేసరికి - ఈ సంఖ్య 32.2 కోట్లకు చేరింది.

భారత్ ఇన్నింగ్స్ మధ్య వరకు - 36.2 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి.

విరాట్ కోహ్లీ శతకం సమయంలో - రికార్డు స్థాయిలో 60.2 కోట్ల వ్యూయర్‌షిప్ నమోదైంది.

- విరాట్ ఇన్నింగ్స్ హైప్

మ్యాచ్ ప్రారంభంలో 6.8 కోట్ల వ్యూస్ ఉన్న లైవ్ స్ట్రీమింగ్, విరాట్ కోహ్లీ సెంచరీ చేసే సమయానికి 60.2 కోట్లకు చేరింది. ఈ పెరుగుదల విరాట్ వల్లనే అని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ హైప్‌తోపాటు విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కూడా 60 కోట్ల వ్యూస్ రావడానికి ప్రధాన కారణం.

-రికార్డులను తిరగరాసిన మ్యాచ్

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఎంతటి క్రేజ్ కలిగిస్తుందో ఈ వ్యూయర్‌షిప్ నంబర్స్ స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ రికార్డు తదుపరి మ్యాచ్‌లకు కూడా ప్రేరణగా మారొచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక మైలురాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Tags:    

Similar News