జర్మనీ ఎన్నికల్లో సంప్రదాయవాదుల విజయం.. అధికార పార్టీ ఓటమి
జర్మనీ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఆ దేశ పాలక పక్షం అనూహ్య రీతిలో మూడో స్థానానికి పరిమితమైంది.
జర్మనీ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఆ దేశ పాలక పక్షం అనూహ్య రీతిలో మూడో స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో రైట్ వింగ్ విజయాన్ని సాధించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి రైట్ వింగ్ ఎన్నికల్లో సానుకూల ఫలితాల్ని సొంతం చేసుకోవటంతో ఆ వర్గానికి చెందిన వారంతా ఆనందంగా ఉన్నారు. జర్మనీ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్న ఒలాఫ్ స్కోల్జ్ తన పార్టీ ఓటమిని అంగీకరించటంతో పాటు.. తమ ఓటమిపై ఆయన వివరణ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో విపక్ష సీడీయూ, సీఎస్ యూ కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. 28.5 శాతం ఓట్లతో 208 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఆర్ఎఫ్ డీ పార్టీ 20.7 శాతం ఓట్లను సొంతం చేసుకొని రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఫలితాలు దేశ ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఉన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జర్మన్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికార ఎస్పీడీ పార్టీ 16.5 శాతం ఓట్లను సొంతం చేసుకొన మూడో స్థానానికి పరిమితమైంది. ప్రజల్లో ఆ పార్టీ విషయంలో ఎంత విముఖతతో ఉన్నారన్న విషయాన్ని తాజా ఫలితం స్పష్టమవుతుందని చెప్పాలి. తాజా ఫలితాలుజర్మనీ రాజకీయాల్లో సరికొత్త ముఖచిత్రంతో పాటు.. కొత్త చర్చలు.. వివాదాలు చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఉండటం గమనార్హం.
ఈ ఎన్నికల ఎజెండాను చూస్తే.. గడిచిన రెండేళ్లుగా దేశ ఆర్థిక పరిస్థితి స్తబ్దుగా ఉండటం.. వలసదారులు చేస్తున్న దాడులు.. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కీలకంగా మారాయని చెప్పొచ్చు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించిన సంప్రదాయవాదులు ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే.. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి వస్తున్న వారిని తిప్పి పంపుతామని.. బహిష్కరణల్ని పెంచుతామని మెర్జ్ హామీ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ హామీలు జర్మన్ ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసినట్లుగా చెప్పాలి. తాజా ఫలితాల నేపథ్యంలో కొత్త చాన్సలర్ గా ఫ్రెడ్రిక్ మెర్జ్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు తన ఓటమిని ఒలాఫ్ షోల్జ్ ఒప్పుకొని తన పదవికి రాజీనామా చేశారు.