ఇద్దరి పిల్లల ప్రాణం తీసిన సెల్ ఫోన్... ఒకరిది హత్య, మరొకరిది ప్రమాదం!
అవును... ఇప్పటి జనరేషన్ పిల్లలు సెల్ ఫోన్ కు తీవ్రంగా అడిక్ట్ అయిపోతున్నారనే ఆందోళనలు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ జనరేషన్ పిల్లలకు, మొబైల్ ఫోన్ కూ ఉన్న కనెక్షన్ గురించి చెప్పే పనిలేదు! ఏమి ఉన్నా లేకున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇక వారిని వారించలేని తల్లితండ్రులు.. ఫోన్ చేతిలో పెట్టి మాట వినేలా, అన్నం తినేలా చేసుకుంటున్నారు! ఈ సమయంలో ఇద్దరు బాలురి ఉసురు తీసింది సెల్ ఫోన్!
అవును... ఇప్పటి జనరేషన్ పిల్లలు సెల్ ఫోన్ కు తీవ్రంగా అడిక్ట్ అయిపోతున్నారనే ఆందోళనలు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి... తండ్రి కోపం కట్టలు తెంచుకోవడంతో జరిగిన హత్య కాగా.. మరొకటి గేమ్ లో ఆదమరిచిన బాలుడు సాంబారు గిన్నెలో పడిన ప్రమాదం!
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులో వృత్తిరీత్యా వడ్రంగి ఐన రవికుమార్ అనే వ్యక్తి కుటుంబంతో కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన 14 ఏళ్ల కుమారుడు సెల్ ఫోన్ కు బాగా అడిక్ట్ అయ్యాడంట. ఈ క్రమంలో చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని చెబుతున్నారు!
ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవంట. పైగా ఇటీవల ఆ ఫోన్ పోవడంతో.. తండ్రికి తెలియకుండా దాన్ని రిపేర్ కూడా చేయించడంతో.. ఇద్దరి మధ్యా మరింత పెద్ద గొడవ జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో కోపం కట్టలు తెంచుకున్న తండ్రి.. క్రికెట్ బ్యాట్ తో కొడుకుని గట్టిగా కొట్టాడట!
అనంతరం గట్టిగా తిడుతూ చితకబాదాడడంతో.. నిప్పి భరించ లేక కుమారుడు నేలపై పడిపోవడం.. ఆ సమయంలో శ్వాస ఆగిపోయిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు!
మరో ఘటనలో...
కర్నూలు జిల్లా కు చెందిన జగదీష్ అనే బాలుడు మేనమామ పెళ్లి కోసం అమ్మనాన్నలతొ కలిసి వడ్డేపలి మండలం, పైపాడు గ్రామానికి వెళ్లాడు. ఈ సమయంలో పెళ్లి విందు కోసం సిద్ధం చేసిన వంటలన్నీ ఓ గదిలో ఉంచారంట. ఈ సమయంలో సెల్ ఫోన్ ఆటలో మునిగిపోయిన బాలుడు.. చూసుకోకుండా వెళ్లి సాంబారు గిన్నెపై కూర్చున్నాడని అంటున్నారు!
ఈ సమయంలో మూత పక్కకు జరగడంతో పిల్లాడు అందులో పడిపోయాడు. ఈ సమయంలో ఆ బాలుడు కేకలు వేయడంతో బయటకు తీసిన బంధువులు కర్నూలు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే... పిల్లాడిని బ్రతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు! ఆస్పత్రిలో చికిత్స పోందుతూ బాలుడు మృతి చెందాడు.