కెనడాలో భారతీయుల సంఖ్యపై చైనా మహిళ వీడియో వైరల్!
ఈ సమయంలో కెనడాలో ఉన్న భారతీయులపై చైనా మహిళ తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు తమ తెలివితేటలతో, శక్తిసామర్ధ్యాలతో పాతుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రపంచలోని పలుదేశాల్లో అటు ఉద్యోగాల్లోనూ, ఇటు వ్యాపారాల్లోనూ టాప్ స్థానాల్లో భారతీయులు తమ సత్తా చాటుతున్నారని అంటుంటారు. ఈ సమయంలో కెనడాలో ఉన్న భారతీయులపై చైనా మహిళ తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును... ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతారు. ప్రధానంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా పలు దేశాల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటారు. ఈ సమయంలో.. కెనడాలో భారతీయుల సంఖ్యపై చైనాకు చెందిన ఓ మహిళ వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చెసింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
కెనడాలోని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష స్థలంలో చైనా మహిళ ఈ వీడియోను చిత్రీకరించింది. అయితే ఆమె చిత్రీకరించిన ఈ వీడియో ప్రకారం.. ఆమెకు కుడివైపున, ఎడమ వైపునా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆ చైనా మహిళ... కెనడాలో ఇంతమంది భారతీయులు ఉన్నారా.. కెనడా రోజురోజుకీ కెనడియన్ గా మారుతోందని కామెంట్ చేసింది.
ఇదే క్రమంలో... తన చుట్టూ కెనడాలో భారతీయులే ఉన్నారని.. మీరు చూసేందుకు ఈ వీడియో తీస్తున్నానని.. తాను డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షా స్థలంలో ఉన్నానని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. తాను ఎక్కడున్నదీ చెప్పకపోతే.. ఈ వీడియో చూసినవారు తాను భారత్ లో ఉన్నానని పొరపాటుపడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే... కెనడా రోజు రోజుకీ కెనడియన్ గా మారుతోందని కామెంట్ చేసింది.
ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఈ చైనా మహిళపై ఫైరవుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... కెనడాలో భారతీయులు ఎక్కువగా ఉంటే నీకొచ్చిన నొప్పి ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత్ పై చైనాకు ఈ ఏడుపు ఎందుకు అని నిలదీస్తున్నారు.
కాగా... 2022లో కెనడా జారీ చేసిన మొత్తం స్టడీ పర్మిట్స్ లో సుమారు 41% భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు! ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటుండగా.. ఇందులో కెనడాలో 4.27 లక్షల మంది విధయనభ్యసిస్తున్నారు.