చంద్రబాబు ఇంటికి మెగాస్టార్...విషయం అదే !

ఇపుడు ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు.

Update: 2024-10-12 16:48 GMT

మెగాస్టార్ చిరంజీవి కోట్లాది ప్రజల హృదయ సింహాసనం మీద కొలువు ఉన్న నాయకుడు. ఆయన ఎప్పటికీ మెగాస్టార్ అని అంతా అంటారు. చిరంజీవి రాజకీయాలు కొద్ది కాలమే చేసినా పార్టీలతో సంబంధం లేకుండా అజాత శతృవుగా నిలిచారు. ఇపుడు ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రాజకీయంగా రాణిస్తున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు సీఎం అయిన తరువాత తొలిసారి మెగాస్టార్ హైదరాబాద్ లోని బాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుని ఆయన కలసి వరద బాధితులకు తాను తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన కోటి రూపాయల సాయానికి సంబంధించిన చెక్కుని అందచేశారు. విజయదశమి పర్వదినం వేళ బాబు ఇంటికి వెళ్ళిన మెగాస్టార్ ని ముఖ్యమంత్రి ఎంతో సాదరంగా ఆహ్వానించారు.

ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇక వరద సాయం చెక్కుని ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన చిరంజీవికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు ఆయనకు ఘనంగా వీడ్కోలు కూడా పలికారు. ఏకంగా మెగాస్టార్ కారు వరకూ వెళ్ళి బాబు ఆయనకు వీడ్కోలు పలకడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి పట్ల ఆ విధంగా చంద్రబాబు తన గౌరవాన్ని చాటుకున్నారు. మెగా ఫ్యామిలీకి టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వంలో పెద్ద పీట వేయడం నుంచి అనేక విషయాలు చూసుకున్నా కూడా మెగా ఫ్యామిలీ పట్ల టీడీపీ పూర్తి సానుకూలంగా ఉంటోంది.

ఎక్కడా వారి గౌరవానికి భంగం కలుగని తీరుతోనే వ్యవహరిస్తోంది. ఎన్నో సార్లు చిరంజీవి గొప్పతనం గురించి కూడా చంద్రబాబు వేదికల మీద ప్రస్తావించారు. ఇపుడు తన ఇంటికి వచ్చిన మెగాస్టార్ ని చంద్రబాబు రిసీవ్ చేసుకున్న విధానం వీడ్కోలు పలికిన తీరుని చూసిన మెగా ఫ్యాన్స్ కచ్చితంగా మురిసిపోతారు అనడంలో సందేహం లేదు.

సేవా కార్యక్రమాలలో ఎపుడూ చిరంజీవి ముందుంటారని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయనకూ రాం చరణ్ కి చంద్రబాబు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియచేశారు. మొత్తానికి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సొంతంగా ఆరు కోట్ల రూపాయలు ఇస్తే మెగాస్టార్ కోటి రూపాయలు ఆయన కుటుంబ సభ్యులైన ఇతర నటులు కూడా ఇచ్చిన ఇతోధిక సాయం లెక్క చూస్తే మెగా కాంపౌండ్ నుంచి వరద సాయం కింద భారీ విరాళమే ప్రభుత్వానికి దక్కింది అని అంటున్నారు.

Tags:    

Similar News