రోజుకి 12 డైట్ కోక్ లు తాగే ట్రంప్ కు కోకా కోలా సర్ ప్రైజ్!
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే.
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కోకా కోలా ప్రియుడైన ట్రంప్ ఆ కంపెనీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్ కోకా కోలా ప్రియుడని.. ఆయన రోజుకు 12 డైట్ కోక్ లను అలవోకగా తాగేవారని న్యూయార్క్ టైమ్స్ గతంలో వెళ్లడించింది.
అవును... అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కోకా కోలా కూల్ డ్రింక్స్ ను తెగ ఇష్టపడతారని చెబుతారు. ఈ సమయంలో.. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆయనకు కోకా కోలా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చింది. ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ కోక్ బాటిల్ ను డిజైన్ చేసింది.
ఈ సందర్భంగా ఆ స్పెషల్ డైట్ కోక్ బాటిల్ ను కోకా కోలా కంపెనీ ఛైర్మన్, సీఈవో జేమ్స్ క్వీన్సీ స్వయంగా దాన్ని తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ కు అందజేశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కమ్యునికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ మార్గో మార్టిన్ ఎక్స్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ బోటల్ పట్టుకున్న ట్రంప్ తో జేమ్స్ క్వీన్సీ ఉన్న ఫోటోను షేర్ చేశారు.
ఇక ఈ స్పెషల్ డైట్ కోక్ బాటిల్ బ్లూ, గ్రే, రెడ్ లేబుల్ పై "అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే ట్రంప్ ప్రమాణస్వీకారం" అని రాసి.. “20 జనవరి 2025” అని తేదీ వేసి ఉంది. దీన్ని ట్రంప్ గౌరవార్థం రెడ్ కలర్ బాక్స్ లో పెట్టి ఇచ్చారు. దీంతోపాటు “అమెరికాలో 8,60,000 ఉద్యోగాలు కల్పించిందని.. $55 బిలియన్స్ ఆర్థిక కార్యకలాపాల్లో భాగమైందని” రాసి ఉన్న కార్డు ఉంది.
కాగా... డొనాల్డ్ ట్రంప్ కు డైట్ కోక్ ఎక్కువగా తాగే అలవాటుందని చెబుతూ.. ఈ అలవాటుపై ఆయనే స్వయంగా ఓ జోక్ చెప్పారు. ఇందులో భాగంగా.. తాను 2016లో వైట్ హౌస్ లో ఓ స్పెషల్ బటన్ ఏర్పాటు చేశారని.. తనకు అవసరమైనప్పుడు దాన్ని నొక్కితే డైట్ కోక్ తెచ్చి ఇచ్చేవారని.. తాను దన్ని నొక్కిన ప్రతీసారీ అంతా కొంచెం భయపడతారని ట్రంప్ సరదాగా చెప్పేవారు.
ఇదే సమయంలో... డొనాల్డ్ ట్రంప్ నీళ్లు తాగడం ఎప్పుడూ చూడలేదని యూ.ఎఫ్.సీ. సీఈవో డానా వైట్ ఓ సందర్భంలో వెల్లడించారు. కాగా.. గతంలో బరక్ ఒబామా ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా ప్రత్యేకమైన బాటిల్ లను సిద్ధం చేసింది కోకా కోలా కంపెనీ. ఆ తర్వాత వాటిని ఈబేలో ఒక్కోటీ గరిష్టంగా 50 డాలర్ల వరకూ ధర పలికింది.