'ఇండియా'లో విభేదాలు మొదలయ్యాయా ?
ఇందులో భాగంగా ఢిల్లీలోని అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయబోతున్నట్లు పార్టీ ప్రకటించింది. అంటే ఢిల్లీలో ఏడు పార్లమెంటు సీట్లున్నాయి.
గ్రౌండ్ లెవల్లో జరిగేది చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే విషయమై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని అన్నీ నియోజకవర్గాల్లోను పోటీచేయబోతున్నట్లు పార్టీ ప్రకటించింది. అంటే ఢిల్లీలో ఏడు పార్లమెంటు సీట్లున్నాయి. అంటే ఏడుసీట్లలోను కాంగ్రెస్ అభ్యర్ధులను దింపబోతోంది. ఇక్కడే ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)కు మండింది. ఎందుకంటే ఒకవైపు ఇండియాకూటమిలో చర్చించకుండానే ఏకపక్షంగా ఒక రాష్ట్రంలో పోటీచేయబోయే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఎలా ప్రకటనచేస్తుందనేది ఆప్ అభ్యంతరం.
గతంలోనే ఢిల్లీలోని ఏడుసీట్లను తనకే వదిలేయాలని కాంగ్రెస్ ను ఆప్ కోరిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఏమీ మాట్లాడని కాంగ్రెస్ ఇపుడు సడెన్ గా ఏడుసీట్లలోను పోటీచేయబోతున్నట్లు ప్రకటించేసింది. ఇక్కడే ఆప్ కు బాగా మండిపోయింది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదుకాబట్టి అన్నీ నియోజకవర్గాల్లోను నేతలు అభ్యర్ధులను గెలిపించేందు రెడీగా ఉండాలని పార్టీ నాయకురాలు అల్కా లాంబ ప్రకటించారు. ఏడుకు ఏడు నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని నేతలు, క్యాడర్ ను లంబా పిలుపిచ్చారు.
దీనికి ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తు కాంగ్రెస్ చేసిన ఏకపక్ష ప్రకటనపై మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. బహిరంగంగా ప్రకటన చేసేముందు భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ మాట్లాడుంటే బాగుండేదన్నారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నపుడు ఇండియాకూటమిలో ఆప్ ఉండి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. భాగస్వామ్య పార్టీలతో చర్చింకుండానే నిర్ణయాలు తీసేసుకుని ప్రకటించేటపుడు ఇక కూటమి ఎందుకని నిలదీశారు.
ఈ నేపధ్యంలోనే ఈనెలాఖరులో ముంబాయ్ లో జరగబోయే ఇండియాకూటమి మూడో సమావేశంలో ఆప్ పాల్గొనే విషయం అయోమయంలో పడింది. ఆప్ గనుక సమావేశాన్ని బహిష్కరిస్తే కూటమికి పెద్ద దెబ్బ తగిలినట్లుగానే భావించాలి. ఇప్పటికే కూటమిలో ఎన్సీపీ ఉంటుందా ఉండదా అనే అయోమయం పెరిగిపోతోంది. ఎన్సీపీ చీఫ్ మాటలు ఒకలాగాను చేతలు మరోలాగాను ఉన్నాయి. తాను ఇండియా కూటమిని వదిలి ఎన్డీయేలో చేరేది లేదని ఒకవైపు చెబుతునే ఎన్డీయేలోని పార్టీలతో భేటీ అవుతున్నారు. మేనల్లుడు, ఎన్డీయే పార్టనర్ అజిత్ పవార్ తో రెండుసార్లు భేటీ అవ్వటమే ఇందుకు నిదర్శనం.