పోప్ కోమాలో ఉంటే పరిస్థితి ఏమిటి?.. నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
ప్రస్తుతం పోప్ ప్రాన్సిస్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం పోప్ ప్రాన్సిస్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారానికి ఆయన ఆసుపత్రిలో చేరి 10 రోజులవుతుంది. ఈ సమయంలో ఆయన సుదీర్ఘ కాలం కోమాలో ఉంటే పరిస్థితి ఏమిటనే విషయం తెరపైకి వచ్చింది.. నిబంధనలు ఏమి చెబుతున్నాయనేది చర్చకు వచ్చింది.
అవును... రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోప్ ఫ్రాన్సిస్. ఈ సందర్భంగా స్పందించిన వాటికన్.. అయినప్పటీకీ ఆయనే పోప్ గా కొనసాగుతారని.. ఆయన స్పృహలోనే ఉన్నారని.. ఆక్సిజన్ తీసుకుంటున్నారని ఆదివారం వెల్లడించింది. అయినప్పటికీ పోప్ ఆసుపత్రిలో ఉండటం పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!
పోప్ మరణించినా.. రాజీనామా చేసినా.. తదుపరి పోప్ ఎన్నికకు సంబంధించి వాటికన్ లో స్పష్టమైన చట్టాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే.. వాటిని పోప్ అనారోగ్యానికి గురైనప్పుడు, స్పృహలో లేనప్పుడు, విధులను నిర్వహించలేనప్పుడు మాత్రం అన్వయించలేమని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి నియమన నిబంధనలు లేవట!
వాస్తవానికి ఒక బిషప్ అనారోగ్యానికి గురైతే తన పరిధిలోని డయాసిస్ లో కార్యకలాపాలను నిర్వహించడానికి నిబంధనలు ఉన్నాయి. అయితే.. పోప్ విషయంలో అవి లేవు. ఈ నేపథ్యంలో.. 2021లో వాటికన్ లాయర్లు.. పోప్ విధులను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను రూపొందించారు.
ఇందులో భాగంగా... పోప్ రాజీనామా చేసినా, మరణించినా.. అనుసరించాల్సిన వ్యూహాలనే అనుసరించవచ్చని సూచించారు. పోప్ అనారోగ్యానికి గురైనప్పుడు తదుపరి వారసుడిని నియమించవచ్చని పేర్కొన్నారు. కాగా... 2013 మార్చి 13న 266వ పోప్ గా ఫ్రాన్సిస్ నియమితులైన సంగతి తెలిసిందే.
2022లో పోప్ ఫ్రాన్సిన్స్ లేఖ!:
తాను అనారోగ్యానికి గురై, స్పృహలో లేకుంటే రాజీనామాను ఆమోదించాలని పోప్ గా ఎన్నికైన ఫ్రాన్సిన్స్ 2022లో అప్పటి కార్యదర్శి కార్డినల్ టార్సిసియో బెర్టోన్ కు లేఖ ఇచ్చారు. దాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత పారోలిన్ కు ట్రార్సిసియో బెర్టోన్ ఇస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆ లేఖలోని పూర్తి సమాచారం బయటపడలేదు.