బీఆర్ఎస్ తప్ప వేరే దిక్కులేదా ?
చేతులు కలపటానికి బీఆర్ఎస్ తప్ప సీపీఎంకు వేరే దిక్కు లేనట్లుంది. అందుకనే మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల సీపీఎం నేతలు భేటీ జరిగింది.
చేతులు కలపటానికి బీఆర్ఎస్ తప్ప సీపీఎంకు వేరే దిక్కు లేనట్లుంది. అందుకనే మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల సీపీఎం నేతలు భేటీ జరిగింది. మద్దతుకోరుతు హరీష్ నాయకత్వంలోని బీఆర్ఎస్ నేతలు కొందరు సీపీఎం పార్టీ నేతలతో చర్చలు జరిపారు. నిజానికి బీఆర్ఎస్ నేతలను సీపీఎం నేతలు దగ్గరకు కూడా రానిచ్చుండకూడదు. ఎందుకంటే అవసరానికి వామపక్షాలను కేసీయార్ వాడుకుని అవసరం తీరగానే తీసి అవతల పాడేశారు. అందుకనే అప్పట్లో కేసీయార్ ను శాపనార్ధాలు పెట్టిన సీపీఎం ఇపుడు మళ్ళీ భేటీ అవటమే చర్చేనీయాంశంగా మారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని తమ అభ్యర్ధులకు మద్దతిచ్చి గెలిపించాలని హరీష్ సీపీఎం నేతలను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీపీఎం నేతలు రాష్ట్రకమిటితో మాట్లాడి ఏ సంగతి చెబుతామని చెప్పి పంపేశారు. ఇక్కడే సీపీఎం వైఖరిపైన జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కేసీయార్ వామపక్షాల మద్దతు తీసుకున్నారు. వామపక్షాల మద్దతు లేకుండా బీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు కష్టమని కేసీయార్ కు అర్ధమైంది.
అందుకనే కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులతో మాట్లాడి, బతిమలాడుకుని ఒప్పించారు. అప్పట్లో జరిగిన ఒప్పందం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటానని. అయితే మునుగోడు ఉపఎన్నికలో గెలవగానే కేసీయార్ వైఖరిలో మార్పు వచ్చేసింది. తర్వాత కమ్యూనిస్టులను మళ్ళీ కేసీయార్ దగ్గరకు రానీయలేదు. ఎన్నికల్లో పొత్తులపై చర్చించాలని, పొత్తు విషయం తేల్చమని వామపక్షాలు ఎన్నిసార్లు అడిగినా కేసీయార్ అసలు స్పందించనే లేదు.
దాంతో ఎదురుచూసి చూసి చివరకు లాభంలేదని కాంగ్రెస్ తో చర్చలు జరిపాయి. ఈ సందర్భంగానే కేసీయార్ వైఖరిపై సీపీఎం నేతలు నానా శాపనార్ధాలు పెట్టారు. బీఆర్ఎస్ ఓటమికి తాము పనిచేస్తామని శపథంకూడా చేశారు. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు ఫెయిలైన కారణంగా 18 చోట్ల సీపీఎం పోటీచేస్తోంది. ఎలాగూ కాంగ్రెస్ తో పొత్తు లేదుకాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ సీపీఎంతో భేటీ అయ్యారు. వాళ్ళు వచ్చి మాట్లాడుతామని అడగ్గానే సీపీఎం కూడా రెడీ అనేసింది. ఇక్కడే సీపీఎంకు బీఆర్ఎస్ తప్ప వేరేదిక్కులేదా ? అని అనిపిస్తోంది.