దానం,రంజిత్ కాంగ్రెస్ లో ఎందుకు చేరారు.. ఏంటి కథ
కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వలసలు కొనసాగాయి.
కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వలసలు కొనసాగాయి. ఇప్పుడు కాంగ్రెస్ వంతయింది. దీంతో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయింది. ఈనేపథ్యంలో పార్టీలో ముఖ్య నేతలే పార్టీ మారేందుకు మొగ్గు చూపడం గమనార్హం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది. అప్పుడు కూడా ఇలాగే కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. ఇక ఆ పాపం ఇప్పుడు బీఆర్ఎస్ ను వేధిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు జంప్ జలానీలుగా మారుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని కాంగ్రెస్ లో చేరుతున్నారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతోంది.
చాలా రోజులుగా నాగేందర్ పార్టీ మారతారని తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని చూశారు. దీనికి అనుగుణంగానే ఆయన మాటలు ఉండేవి. దీంతో చాలా మందిలో ఆయన పార్టీ మార్పుపై అంచనాలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ పార్టీ మారడం ఎలాంటి సంచలనాలకు తావివ్వలేదు. అందరికి మామూలుగానే అనిపించింది.
ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. ఏదో ఒక పదవి ఉంటుందనే ఆశతోనే పార్టీ మారుతున్నారు. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే పార్టీ మారేందుకు సిద్ధ పడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. పార్టీలో చేరాలనే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.