ఛలో చలో... ఆధార్ కార్డ్ కోసం వార్నర్ ఆత్రం వీడియో వైరల్!

వార్నర్... సమీపంలోని ఆధార్ కార్డ్ సెంటర్ గురించి చెప్పగానే చలో చలో అంటూ పరుగు మొదలుపెడతాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Update: 2024-04-23 08:17 GMT

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గురించి పెద్దగా ఎవరికీ పరిచయం అవసరం లేదనే అనుకోవాలి! క్రికెట్ తో పాటు తెలుగు సినిమా స్టార్ హీరోలను ఇమిటేట్ చేస్తూ.. ప్రధానంగా "బుట్టబొమ్మ", "పుష్ప" సాంగ్స్ కి అతడు చేసిన డ్యాన్స్.. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లలో వైరల్ గా మారింది. ఇక మైదానంలో వార్నర్ ఉన్నాడంటే... ఆ సాంగ్ వినిపించడం, స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో వార్నర్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... అటు ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డెవిడ్ వార్నర్.. ఇండియన్ సినిమా సాంగ్స్ పై డ్యాన్స్ చేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... ఆ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ఈ సమయంలో అతడికి సంబంధించిన ఒక వీడియోని ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.

ఇందులో భాగంగా... ఉచిత ఆహారాన్ని ఆస్వాదించడం నుంచి అందమైన అమ్మాయిలను కలవడం వరకు అనేక విషయాలకు సంబంధించిన ఆఫర్స్ రాగా వాటన్నింటినీ తిరస్కరించే వార్నర్... సమీపంలోని ఆధార్ కార్డ్ సెంటర్ గురించి చెప్పగానే చలో చలో అంటూ పరుగు మొదలుపెడతాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో దర్శనమిస్తుంది.

దీనికి ముందు, వార్నర్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి పనిచేసిన సంగతీ తెలిసిందే. ఒక వాణిజ్య ప్రకటనలో, రాజమౌళి ఫాంటసీ చిత్రంలో వార్నర్ ప్రధాన పాత్రను పోషించాడు. ఇందులో భాగంగా... ఫైట్స్, డ్యాన్స్ సన్నివేశాలలో నిమగ్నమై ఉన్నాడు. రాజమౌళి డిస్కౌంట్ కోసం బేరసారాలు చేయడంతో వీడియో మొదలై, వార్నర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ లో ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించడంతో ముగుస్తుంది. ఇదే సమయంలో... ఆస్కార్స్‌ లో కలుస్తానని సరదాగా వాగ్దానం కూడా చేశాడు.

కాగా... 2009లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసి తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న డేవిడ్ వార్నర్... ఇప్పటివరకూ 183 మ్యాచ్ లు ఆడి 6564 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలూ ఉండటం గమనార్హం. ఇక ఐపీఎల్ కెరీర్ లో వార్నర్ అత్యధిక స్కోరు 126 కాగా.. యావరేజ్ 40.77 గా ఉంది.

Tags:    

Similar News