ఇకపై మరణించిన తర్వాత అంతా బూడిదే కాదు.. కోట్లు సంపాదిస్తున్నారు!

మనిషికి బ్రతికి ఉన్నప్పుడే విలువ.. మరణించిన తర్వాత అంతా మట్టే, అంతా బూడిదే అని అంటారు.

Update: 2024-10-20 14:15 GMT

మనిషికి బ్రతికి ఉన్నప్పుడే విలువ.. మరణించిన తర్వాత అంతా మట్టే, అంతా బూడిదే అని అంటారు. అయితే... ఆ అభిప్రాయం తప్పని.. మనిషి మరణించిన తర్వాత మిగిలిన చితాభస్మం కూడా చాలా విలువైనదని.. దానితోనూ డబ్బులు సంపాదించొచ్చని నిరూపించింది జపాన్ దేశం. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అవును... బతికి ఉన్నంతకాలమే మనిషికి విలువ.. తర్వాతే ఏముంటుంది అంతా బూడిదే అని అంటారు. అయితే... చనిపోయిన శరీరం బూడిదగా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ చితాభస్మాని జాగ్రత్తగా భద్రపరిచి, పవిత్ర నదుల్లో కలిపేస్తుంటారు. సాధారణంగా మనదేశంలోని హిందూ సంప్రదాయంలో ఈ పద్దతి పాటిస్తుంటారు.

అయితే... చనిపోయిన శరీరం బూడిదగా మారిన తర్వాత కూడా.. ఆ బూడిదకు అంతకు మించిన విలువ పెరుగుందని నిరూపించింది జపాన్ దేశం! ఇందులో భాగంగా... ఆ బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్ కు వాడే టైటానియం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయని జపాన్ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం గుర్తించింది.

దీంతో... గత ఐదేళ్లలో ఆ దేశంలో చనిపోయిన సుమారు 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలు సేకరించింది. అలా సేకరించిన లోహాలను విక్రయించడం మొదలుపెట్టింది. ఫలితంగా.. సుమారు రూ.400 కోట్లను ఆర్జించింది. దీంతో... ఈ డబ్బును దేశవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల నిర్వహణకోసం వినియోగిస్తోందట అక్కడి ప్రభుత్వం.

సో... మనిషి బ్రతికి ఉన్నంత వరకే, తర్వాత ఏముంది అంతా బూడిదే అనే మాటలు మాట్లాడుకునే ముందు ఇకపై జపాన్ లోని విషయాలను ఒకసారి పరిగణలోకి తీసుకోవాలన్నమాట!

Tags:    

Similar News