ఉత్తరాంధ్ర వైసీపీని నుంచి పడబోయే మొదటి వికెట్ ?

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ ఎవరూ ఇంతవరకూ పార్టీ మారింది లేదు.

Update: 2024-09-21 03:41 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైసీపీకి చెందిన బిగ్ షాట్స్ ఎవరూ ఇంతవరకూ పార్టీ మారింది లేదు. అయితే చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. అదే సమయంలో కొందరు పరిస్థితులను గమనిస్తున్నారు. అవకాశం కోసం వారు వేచి ఉన్నారు.

ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. ధర్మాన తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు.

ఆయన రాజ్యసభ సీటు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు ఆ సీటు ఇచ్చి తన కుమారుడు రాం మనోహర్ నాయుడుకు రాజకీయ భవిష్యత్తు మీద తగిన హామీని ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన కుటుంబంగా ఉన్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణని సైడ్ చేసేశారు.

కొత్తవారిని ప్రోత్సహించాలని భావించి శంకర్ అనే యువ సర్పంచ్ కి ఈసారి టికెట్ ఇస్తే ఆయన గెలిచి వచ్చారు. అయితే రాజకీయ నేపథ్యం బలంగా ఉన్న ధర్మాన ఫ్యామిలీ టీడీపీలోకి జంప్ అయితే ఆయన కుమారుడు రాం మనోహర్ నాయుడుకు వచ్చే ఎన్నికల్లో అయినా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు అని అంటున్నారు.

అదే సమయంలో పెద్దల సభకు వెళ్లాలని ధర్మాన ఆశపడుతున్నారని అంటున్నారు. ఆయన రాజ్యసభ కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మేధావిగా ధర్మాన ఉన్నారు. ఆ విధంగా కనుక తనకు చాన్స్ ఇస్తే టీడీపీలో చేరేందుకు రెడీ అన్నట్లుగా ఆయన సంకేతాలు పంపుతున్నారని టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ రాజ్యసభ కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయన పార్టీ మారేందుకు రెడీ అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీని నుంచి పడబోయే బిగ్ వికెట్ మొదటి వికెట్ ధర్మాన ప్రసాదరావుదే అని అంటున్నారు.

ఆయన వైసీపీ అధినాయకత్వం తీరు మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఇక వైసీపీలో ఉంటే కనుక అయిదేళ్ల పాటు పార్టీలో ఏ అవకాశాలు రావు. అందుకే ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ధర్మాన వైసీపీలో ఉన్నపుడు చంద్రబాబు మీద కానీ పవన్ మీద కానీ పెద్దగా విమర్శించినది లేదు.

అలా ముందు చూపుతోనే ఆయన జాగ్రత్త పడ్డారా అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ధర్మాన ఎపుడూ విధానపరమైన విమర్శలే చేస్తారు అని అంటున్నారు. దాంతో ఆయన చేరుతామంటే తీసుకునేందుకు కూడా టీడీపీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. మొత్తానికి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న టీడీపీ కి ధర్మాన చేరిక వల్ల మరింత బలం పెరుతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తే మాత్రం ఈ జిల్లాలో పెను రాజకీయ పరిణామాలు సంభవిస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News