అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్!
దీంతో.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం, అందులో అల్లు అర్జున్ ను ఏ11 గా చేర్చడం తెలిసిందే.
‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం, అందులో అల్లు అర్జున్ ను ఏ11 గా చేర్చడం తెలిసిందే.
దీంతో.. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించే క్రమంలోనే హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో తాజాగా నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
అవును.. హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. ప్రస్తుతానికి ఇది బిగ్ రిలీఫ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియగా.. శుక్రవారం నాడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది.
కాగా... నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇటీవల నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.