నాగబాబు సంబరాలకు చంద్రబాబు స్మాల్ బ్రేక్ వేశారా?

జనసేన కీలక నేత, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య, కొణిదెల నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-28 16:14 GMT
నాగబాబు సంబరాలకు చంద్రబాబు  స్మాల్  బ్రేక్  వేశారా?

జనసేన కీలక నేత, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య, కొణిదెల నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో.. నెక్స్ట్ ఆయన మంత్రి కూడా అవుతారని.. ఇందులో భాగంగా... ఉగాదికి నాగబాబు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోన్న వేళ ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు ఉగాదికి మంత్రి కాబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు కీలకమైన శాఖను కేటాయించే అవకాశం ఉందనే చర్చా బలంగా నడిచింది. అయితే.. నాగబాబును కేబినెట్ లోకి తీసుకునే విషయంలో బాబు స్మాల్ గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం నాగబాబు ఎమ్మెల్సీగా అయిన అనంతరం.. మంత్రి పదవి లాంఛనమే అనే చర్చ జరిగింది. అయినప్పటికీ.. దానికి ఇంకాస్త సమయం ఉందని.. ఉగాదికి జరిగే అవకాశం లేదని.. అందుకు చిన్న కారణం ఉందని.. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆ కార్యక్రమాన్ని కాస్త వాయిదా వేస్తున్నారని అంటున్నారు.

ఈ ఉగాదికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఈ సమయంలో.. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే దీని ప్రభావంతో పీ4పై ఫోకస్ పోతుందనేది పలువురి అభిప్రాయంగా ఉందని.. ఈ మేరకు చంద్రబాబుకు కొంతమంది సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.

దీంతో ఉగాదికి ప్రారంభించబోతున్న పీ4 కార్యక్రమం అనంతరం చిన్నపాటి గ్యాప్ తీసుకుని, మంచి రోజు చూసుకుని, నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. నాగబాబును కేబినెట్ లోకి తీసుకునే విషయంలో బాబుకు మరో ఆలోచన లేదు కానీ.. ఉగాదికి మాత్రం ఆ ప్రకటన ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ విషయంపై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సమాచారం అందించారని తెలుస్తోంది. అందుకు పవన్ సానుకూలంగానే స్పందించారని అంటున్నారు!

Tags:    

Similar News