బాబు గురించి గూగుల్ అంకుల్ కే తెలుసా ?

అందుకే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒక ప్రశ్న సంధించి దానికి జవాబు గూగుల్ అంకుల్ ని అడిగి తెలుసుకోమన్నారు.;

Update: 2025-03-28 17:30 GMT
Chandrababu development of tech vision

ఈ రోజున ఏ సమాచారం కావాలి అన్నా గూగుల్ అంకుల్ నే కలుస్తారు, ఆయన్నే పిలుస్తారు. సర్వ సమస్తం మ్యాటర్ అంతా గూగుల్ నుంచే నేటి తరం తీసుకుంటోంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒక ప్రశ్న సంధించి దానికి జవాబు గూగుల్ అంకుల్ ని అడిగి తెలుసుకోమన్నారు.

మద్రాస్ ఐఐటీ విద్యార్ధులతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయనను ఒక విద్యార్ధిని తాను తెలంగాణా కరీంనగర్ కి చెందిన వారిగా పరిచయం చేసుకుంటూ ఏ ఐ ని విద్యా విధానంలో ఎలా ఒక ముఖ్య భాగంగా మారుస్తారు అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఐటీ నిపుణుడు ఉండాలన్న మీ ఆలోచన ఏ విధంగా లక్ష్యాలను సాధిస్తుందని ఆమె అడిగారు.

దానికి బాబు ఆమె ఇయర్ ఆఫ్ బర్త్ ని అడిగి నీవు పుట్టకముందే ఉమ్మడి ఏపీని 1995లో సీఎం ని అయ్యాను అని సరదాగా కామెంట్స్ చేశారు. ఆ రోజులలో ఐటీ గురించి తెలియదు అని కానీ తాను భవిష్యత్తు ఊహించి అలా ప్రమోట్ చేస్తూ వచ్చాను అని ఇపుడు ఏ ఐ గురించి కూడా అదే చేస్తున్నాను అని చెప్పారు. టెక్నాలజీయే అంతా మారుస్తుంది అని బాబు అన్నారు. ఒక ఆలోచన ఆచరణలో పెడితే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని బాబు చెప్పారు.

అదే సమయంలో హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో గూగుల్ అంకుల్ ను అడగండి అని కూడా అన్నారు. హైదరాబాద్ గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించాలని కోరారు. ఇక తాను టెక్నాలజీ మీద ఎందుకు ఆసక్తిని కనబరుస్తాను అన్నది బాబు చెబుతూ తనకు ఫ్యూచర్ మీద ఉన్న నమ్మకం విశ్వాసమే అలా చేయిస్తుదని అన్నారు.

చాలామంది అనుకుంటున్నట్టు నా చేతి రింగ్ పూజారి ఇచ్చింది కాదు. ఇదే నా ఆరోగ్యం విషయంలో నన్ను అలర్ట్ చేస్తుందని బాబు చెబుతూ తన ఇంట్లో ఒంట్లో కూడా టెక్నాలజీ ఎంతలా భాగం అయిపోయిందో వివరించారు. వాట్సప్ వంటివి కూడా జస్త్ సమాచారం కోసమే కాదని వాటిని కూడా ఎంతగానో జీవితంలో ముందుకు వెళ్ళేందుకు వాడుకోవచ్చు అని బాబు చెప్పారు. ఉత్పాదక సాధనంగా వాట్సప్ ని కూడా చేస్తున్నామని అన్నారు. ఏపీలో సాంకేతికపరంగా ఏమి జరుగుతోంది అన్నది యువతరం అంతా గమనించాలని బాబు కోరారు.

ఇక యంగ్ ఐఐటీ స్టూడెంట్స్ అంతా బాబు ఇస్తున్న స్పీచ్ కానీ ఆయన వారికి ఇచ్చిన జవాబులు కానీ అన్నీ వింటూ చాలా అడ్మైర్ అయ్యారనే అంటున్నారు. బాబు ఏడున్నర పదుల వయసులో కూడా యంగర్ జనరేషన్ తో పోటీ పడుతూ ఏ ఐ గురించి వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణల గురించి చెప్పడం చూసిన వారు బాబు నిజంగా ఐటీ బాబే అని అంటున్నారు. ఇక గూగుల్ అంకుల్ అయితే బాబు గురించి చెప్పాల్సిందే చెబుతాడు కదా. హైదరాబాద్ ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఆయన ఇచ్చే జవాబు బాబు అనే వస్తుంది కదా. దటీజ్ బాబు అన్న మాట.

Tags:    

Similar News