యూపీ స్కూల్స్ లో తెలుగు... తెరపైకి ఇంట్రస్టింగ్ హ్యాష్ ట్యాగ్!

జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-04-01 06:39 GMT
యూపీ స్కూల్స్ లో తెలుగు... తెరపైకి ఇంట్రస్టింగ్ హ్యాష్ ట్యాగ్!

దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం త్రిభాషా విధానంపై వివాదం సృష్టించబడుతోందని అన్నారు.

ఈ సందర్భంగా... తమ స్టేట్ లోని స్కూల్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషలను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా.. పరోక్షంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పై విమర్శలు చేశారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

ఈ భాషా వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి స్పందించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. గత వారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డీఎంకే చీఫ్ తన ఓటు బ్యాంకు ప్రమాదంలో ఉందని భావించి.. ప్రాంతం, భాష ఆధారంగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో... స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతూ స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు!

స్టాప్ హిందీ ఇంపోజిషన్!:

ఉత్తరప్రదేశ్ స్కూల్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషలను బోధిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా... యూపీలో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంతమంది టీచర్స్ ఉన్నారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో.. తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంత మంది విద్యార్థులు ఎన్ రోల్ చేసుకున్నారనే వివరాలను వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా... తమిళనాడులోని విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకుని రారని చెబుతూ... 'స్టాప్ హిందీ ఇంపోజిషన్' అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News