ఇది వెడ్డింగ్ పాస్ పోర్ట్ బాస్ !

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచిపోయే మధురజ్ఞాపకం. అందుకే దానిని వినూత్నంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు.

Update: 2024-06-15 17:30 GMT

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచిపోయే మధురజ్ఞాపకం. అందుకే దానిని వినూత్నంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. పెళ్లి పత్రికల నుండి పెళ్లిమండపం వరకు, పెళ్లికి వంటల నుండి పెళ్లి వేదిక వరకు కొత్తగా ఉండాలని భావిస్తారు. ఒకరు ఆకాశంలో, ఒకరు నీటి అడుగులో, ఒక జలాంతర్గాములలో ఇలా వందలాది పెళ్లిళ్లు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ తల్లి తన కుమారుడి పెళ్లిని అదే విధంగా చేయాలని ఆశించింది.

కువైట్ ఎంబసీలో పనిచేసే తిరుపతికి చెందిన భారతీయ తెలుగు మహిళ రషీదా తన కుమారుడు వజ్రాల అశిష్ బాబు, కోడలు హీనా సాధిక్ శిరోల్ వివాహ ఆహ్వాన పత్రికను అచ్చం పాస్ పోర్ట్ నమూనాతో, అలాంటి అక్షరాలతోనే కనిపించే విధంగా ముద్రించారు. దానికి వెడ్డింగ్ పాస్ పోర్ట్ అని పేరు పెట్టడం విశేషం.

దాంతో పాటు రిసెష్పన్, పెళ్లి రోజు తేదీలను ఫ్లైట్ టికెట్ల మాదిరిగా తయారు చేయించారు. అందులో పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ పార్ట్ పేరుతో పెళ్లి రోజు తేదీలను సమయాన్ని పెళ్లి జరిగే ప్రదేశాన్ని వధూవరుల పేర్లను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. వీరి వివాహం గోవాకు సమీపంలో ఉన్న బెల్గావీలో జరుగుతుండగా రిసెప్షన్ ఏపీలోని గూడూరు జిల్లాలో పెళ్లి కుమారుని ఇంటి దగ్గర జరగనుంది. రషీదా వినూత్న ఆలోచనను స్నేహితులు, బంధువులు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News