చెన్నై శివారులో గబ్బు పార్టీ.. దీనికి గురించి తెలిస్తే వికారమే!
వీరి అతి చేష్టలపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన వారు ఫామ్ హౌస్ కు చేరుకొని తనిఖీలు చేపట్టారు.
ఇలాంటి పార్టీలు కూడా ఉంటాయా? అన్న విస్మయానికి గురి చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. చెన్నై శివారులోని ఒక ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న ఈ గబ్బు పార్టీ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ తరహా పార్టీలా? అన్న ఆశ్చర్యాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. మారుతున్న కాలానికి తగ్గట్లే.. ఈ తరహా దరిద్రపుగొట్టు అభిరుచులు తగలబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు పై పనైయూర్ వద్ద ఒక ఫామ్ హౌస్ ను కొందరు పార్టీ కోసం బుక్ చేసుకున్నారు. ఈ వేడుకకు కొందరు పురుషులు.. మహిళలు చేరుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున శబ్దంతో పాటలు పెట్టుకోవటం.. గంజాయి సేవించటంతోపాటు మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలతో వారు చేసిన చేష్టలు సదరు ఫామ్ హౌస్ సిబ్బంది సైతం షాక్ తిన్నారు.
పార్టీకి హాజరైన పురుషులు..మహిళల్ని మార్చుకోవటం (స్వాప్) చేసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వీరి అతి చేష్టలపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన వారు ఫామ్ హౌస్ కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మంది మహిళల్ని.. పదిహేను మంది పురుషుల్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వీరిని విచారించగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.
కొవై జిల్లాలోని మేట్టుపాళ్యానికి చెందిన సింథిల్.. ఆయన సతీమణి ఆర్థికంగా చితికిపోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా స్వాప్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున గాలం వేశారు. వీరి మాటలకు ఆకర్షితులైన పలువురు పార్టీకి హాజరయ్యారు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయినా.. ఈ తరహా పార్టీలకు హాజరయ్యేందుకు చూపిన ఆసక్తి పోలీసులను విస్తుపోయేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.