ఫీల్డ్ వదిలేస్తున్న దువ్వాడ ?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అన్నది తెలిసిందే.;
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అన్నది తెలిసిందే. ఆయన దూకుడుగా రాజకీయం చేస్తారని పేరు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఆయన కింజరాపు కుటుంబం మీద డైరెక్ట్ ఫైట్ అన్నట్లుగానే దశాబ్దాల నుంచి చేస్తూ వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రజారాజ్యం నుంచి వైసీపీలో చేరారు.
ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం అయితే దక్కలేదు. ఆయనను ఎమ్మెల్సీగా జగన్ అవకాశం ఇచ్చి పెద్దల సభకు పంపించారు. అయితే అధికారంలో వైసీపీ ఉన్నపుడు ఆయన రాజకీయంగా ప్రత్యర్ధుల మీద ఘాటు విమర్శలు చేశారు. దాని మీద కేసులు అయితే ఇపుడు వచ్చి పడుతున్నాయి. లేటెస్ట్ గా చూస్తే పవన్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
దాంతో ఆయన మీద మళ్ళీ కేసులు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన అరెస్టుని జనసేన నేతలు కోరుకుంటున్నారు. మరో వైపు చూస్తే దువ్వాడ ఈ కేసులు పడిన తరువాత కొంత తగ్గినట్లుగా కనిపించారు. ఆయన ఎక్కడా మీడియా ముందుకు వచ్చి వైసీపీ తరఫున తన వాయిస్ అయితే వినిపించడం లేదు. మరో వైపు చూస్తే ఆయన తన భాగస్వామి మాధురితో కలసి వాకులా సిల్క్స్ అనే షోరూం ని హైదరాబాద్ లో ప్రారంభించారు.
పది కోట్ల రూపాయలతో ఈ షో రూం ప్రారంభం అయింది. ఈ షోరూం ని హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. దీని మీద పవన్ ఫ్యాన్స్ అయితే గుర్రుగా ఉన్నారు. తమ నాయకుడి మీద విమర్శలు చేసిన వారి షో రూం ప్రారంభానికి ఎలా వెళ్తారు అని వారు గరం గరం అవుతున్నారు.
ఈ నేపధ్యం ఇలా ఉంటే దువ్వాడ మాధురి కలసి మరిన్ని షో రూములను తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించాలని చూస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా వస్త్ర వ్యాపర రంగంలోకి దువ్వాడ సీరియస్ గానే అడుగుపెడుతున్నారని అంటున్నారు. ఆయన అంతకు ముందు కాంట్రాక్టులు చేసేవారు అని చెబుతారు. ఇక ఆయనకు వేరే ఏ బిజినెస్ లు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఇపుడు మాత్రం ఆయన వస్త్ర వ్యాపార రంగంలోకి పెద్ద ఎత్తున దిగబోతున్నారు.
రానున్న రోజులలో ఈ రంగంలోనే తన జీవితాన్ని కొనసాగించాలని చూస్తున్నారని అంటున్నారు. రాజకీయాలకు ఆయన పూర్తిగా విరామం ఇస్తారని అంటున్నారు. మరో రెండేళ్లలో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది అని అంటున్నారు.
దాంతో పొలిటికల్ ఫీల్డ్ కి ఆ ఫీల్డింగ్ కి ఆ ఫీలింగ్స్ కి కూడా గుడ్ బై చెప్పేసి ఇక బిజినెస్ ఫీల్డ్ నే ఎంచుకోవాలని కొత్త జీవితాన్ని ఆ విధంగా మొదలెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఆయన అయితే ఎక్కువ సమయం బిజినెస్ వ్యవహారాల్లోనే గడుపుతున్నారని అంటున్నారు. ఆయన కనుక తప్పుకుంటే వైసీపీకి ఈ జిల్లాలో మరో కీలక నేత దూరం అయినట్లే అని అంటున్నారు.