దర్శి టీడీపీ అభ్యర్తిగా మహిళా డాక్టర్... ఎవరీ లక్ష్మి?
అవును... చంద్రబాబు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల చివరి జాబితాలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు తెరపైకి వచ్చింది
రాజకీయాల్లో అనుభవజ్ఞులతో పాటు యంగ్ బ్లడ్ కూడా ఉండాలని చెబుతుంటారు. అసెంబ్లీ కూడా ఇలా సమపాళ్లలో ఉంటే... మరింత మెరుగైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో ఈసారి అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా పలువురు యంగ్ బ్లడ్ కి టిక్కెట్లు కేటాయించారు. ఇందులో భాగంగా దర్శి అసెంబ్లీ టిక్కెట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దక్కింది. దీంతో.. ఈమెపై గూగుల్ సెర్చ్ పెరిగిందని తెలుస్తుంది.
అవును... చంద్రబాబు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల చివరి జాబితాలో భాగంగా ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ స్థానానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరు తెరపైకి వచ్చింది. నరసరావు పేటలో డాక్టర్ గా పనిచేస్తున్న ఈమె... దివంగత టీడీపీ సీనియర్ నేత, మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమర్తె! ఇదే సమయంలో ప్రస్తుతం అద్దంకి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు అన్న కూతురు!
వాస్తవానికి గత ఏడెనిమిది నెలలుగా నరసరావు పేట అసెంబ్లీ టిక్కెట్ కడియాల ఫ్యామిలీకి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా లక్ష్మీ మామ కడియాల వెంకటేశ్వర రావు పేరు ఈ రేసులో తెరపైకి వచ్చింది. అయితే... చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల ఇంటి కోడ్దలు లక్ష్మికి ఆమె సొంత జిల్లాలోని దర్శి టిక్కెట్ దక్కింది.
ఇలా దర్శి టిక్కెట్ గొట్టిపాటి లక్ష్మికి రావడంలో ఆమె బాబయ్ గొట్టిపాటి రవి తెరవెనుక చక్రం తిప్పారని తెలుస్తుంది. దర్శి సీటు జనసేనకు వెళ్తుందని తొలుత వార్తలు వచ్చినా... తర్వాత టీడీపీ నుంచి కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చినా... ఆమె బాబయ్ రవి వ్యూహాత్మకంగా పావులు కదపడపడంఓ.. టిక్కెట్ లక్ష్మికి దక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమెను గెలిపించే బాధ్యత కూడా రవి తీసుకున్నట్లు తెలుస్తుంది!
ఇక గొట్టిపాటి లక్ష్మి తండ్రి నరసయ్య గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆయనకు రాజకీయంగా క్లీన్ ఇమేజ్ ఉందని చెబుతారు. ఆ తర్వాత 2014లో లక్ష్మి సోదరుడు భరత్ కూడా వైసీపీ నుంచి పర్చూరు లో పోటీ చేశారు.