ఉరుకులు-ప‌రుగులు.. నాయ‌కుల‌కు నిద్ర కూడా లేదే!

దీంతో పార్టీల‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. నిజానికి 2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. ఈ ద‌ఫా ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా సాగిపోతాయ‌ని వైసీపీ అనుకుంది.

Update: 2024-05-10 10:40 GMT

మ‌రొక్క రోజు... కీల‌క‌మైన ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించి ప్రభుత్వాన్ని ఎన్నుకొనేందుకు.. ఏపీ ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీల‌కూ,, నాయ‌కుల‌కు కూడా ఉన్న గ‌డువు కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత‌.. మైకులు బంద్‌. సోషల్ మీడియా కూడా బంద్‌. ఇక‌, 13న ఎన్నిక‌ల పోలింగ్. మ‌రోవైపు.. ప్ర‌జానాడి ఎటుంది? అనేది ఎవ‌రికీ అంతుచిక్క‌ని బ్ర‌హ్మ‌ప‌దార్థం మాదిరిగా ఉంది. ఎవ‌రు ఓట‌రు నోటి ముందు మైకు పెట్టినా.. ఆ మీడియా ఆనుపానులు తెలుసుకుని.. ఏదో ఒక టి చెబుతున్నారు.

దీంతో పార్టీల‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. నిజానికి 2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. ఈ ద‌ఫా ఎన్నిక‌లు ఏక‌ప‌క్షంగా సాగిపోతాయ‌ని వైసీపీ అనుకుంది. ఇదే త‌ర‌హాలో టీడీపీ కూడా ఆశ‌లు పెట్టుకుంది. చంద్ర‌బాబు అరెస్టు, ఆయ‌న స‌తీమ‌ణిని తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఆయ‌న అసెంబ్లీని బాయ్ కాట్ చేయ‌డం.. విధ్వంసాలు, రాజ‌ధాని లేక‌పోవ‌డం.. ఉద్యోగుల‌ను వేధించ‌డం వంటివి ఏక‌ప‌క్షంగా క‌లిసి వ‌స్తాయ‌ని టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. కానీ, ఆ త‌ర‌హా ప‌రిస్థితినిజ‌మేన‌ని అనుకున్నా.. జ‌గ‌న్‌సానుభూతి వెల్లువ‌లా ఉంది.

ఇదే టీడీపీని కంటిపై కునుకులేకుండా చేసింది. పొత్తు పెట్టుకున్నా.. చివ‌రి నిముషం వ‌ర‌కు క‌లిసి రాని బీజేపీ నేత‌ల‌తో ఇబ్బందులు కూడా చంద్ర‌బాబును ఇరుకున పెట్టాయి. మ‌రోవైపు.. త‌న‌కు ఏకంగా 175 సీట్లు వ‌చ్చేస్తాయ‌ని ఆశలు పెట్టుకుంది. తాము ఇస్తున్న సంక్షేమం, డీబీటీ వంటివిమేళ్లు చేస్తాయ‌ని అనుకున్నా.. ఎన్నిక‌ల ఘ‌డియ వ‌చ్చేస‌రికి ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. కూట‌మి తెర‌మీదికి వ‌చ్చింది. త‌మ‌కు మించిన హామీల‌ను చంద్ర‌బాబు వండివార్చారు. పింఛ‌నును 4 వేలు చేస్తామ‌న్నారు.

దీంతో వైసీపీకి కూడా కంటిపై కునుకులేకుండా పోయింది. దీనికి తోడు సొంత చెల్లెళ్లే శూలాలుగా మారి.. రాజ‌కీయంగా వేడి ర‌గిలించారు. ఈ ప‌రిణామాలో ఉన్న ఒక్క‌రోజును స‌ద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయ‌కులు అలుపెరుగకుండా.. ప‌నిచేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఐదు స‌భ‌లు నిర్వ‌హిస్తున్నా రు.అన్నం కూడా తింటున్నారో లేదో డౌటే. కేవ‌లం డ్రింకులు, జ్యూసుల‌తోనే అది కూడా ప్ర‌యాణాల స‌మ‌యంలోనే కానిస్తున్నారు. మొత్తానికి మునుపెన్న‌డూ లేని చ‌విచూడ‌ని రాజ‌కీయం ఏపీలో క‌నిపిస్తోంది. మ‌రి ఓట‌రు దేవుడు ఎవ‌రిని క‌రుణిస్తాడో చూడాలి.

Tags:    

Similar News