హర్యానాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఎగ్జిట్ పోల్స్ నుంచి అన్ని రకాల అంచనాలు చెబుతున్నది ఒక్కటే. హర్యానా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ వశం కానుందని.

Update: 2024-10-08 04:24 GMT

ఎగ్జిట్ పోల్స్ నుంచి అన్ని రకాల అంచనాలు చెబుతున్నది ఒక్కటే. హర్యానా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ వశం కానుందని. పదేళ్లుగా బీజేపీ గుప్పిట్లో ఉన్న హర్యానా ఇప్పుడు హస్తం గూటికి చేరనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు సైతం స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఎన్నికల ఫలితాల వెల్లడి అన్నది సాంకేతికంగా మారింది. పదేళ్లు బీజేపీ చేతిలో ఉన్నప్పటికీ ధనిక రాష్ట్రమైన హర్యానాలో ఎలాంటి మార్పు లేదన్న మాటతో పాటు.. బీజేపీ హయాంలో హర్యానాలో డెవలప్ మెంట్ పూర్తిగా ఆగిందన్న మాట అంతకంతకూ పెరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకతగా మారి.. అధికార బదిలీకి రంగం సిద్ధమైందన్న మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్ కు బంఫర్ మెజార్టీ ఖాయమని తేలుతున్న వేళ.. హర్యానాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానా అసెంబ్లీలో సింహభాగం సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందన్న మాట వినిపిస్తోంది. పార్టీ వర్గాలతో పాటు మీడియా అంచనాల్ని చూస్తే.. సీఎం రేసులో ఇద్దరు కనిపిస్తున్నారు. వారిలో ఒకరు పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా.. మరొకరు రణ్ దీప్ సూర్జేవాలా.

ఈ నేపథ్యంలో సెల్జా స్పందించారు. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో తన పేరు బలంగా వినిపిస్తున్న వేళ.. తన అర్హతను ఆమె తక్కువ చేసి చూపించుకోకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సైతం ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అవసరమైన అర్హతలు.. అనుభవం కూడా ఉందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. అదే సమయంలో సీఎం పదవిని ఆశిస్తున్నాన్న భావన కలగకుండాచేయటం కోసం ఆమె చాలానే శ్రమించారు.

‘‘నేనేమీ చెప్పలేను. నేనే కాదు.. ఎవరూ చెప్పలేరు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇప్పటికే నేను పబ్లిక్ డొమైన్ లో మాట్లాడాను. ఈ విషయం హైకమాండ్ కు తెలుసు. అధిష్ఠానమే తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆమె రాజకీయ ప్రత్యర్థి పార్టీకి చెందిన సూర్జేవాలతో పోలిస్తే.. ఆమెనే దూకుడుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఆమెను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News