రతన్ టాటాను చంపాల్సిన అవసరం ఎవరికుంది..?

రతన్ టాటా లాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉంది.. వచ్చింది!!

Update: 2024-10-10 07:30 GMT

ఎన్నో మంచి లక్షణాలతో పాటు సింపుల్ గా బ్రతుకుతూ.. దేశం ఫస్ట్ ప్రాఫిట్ నెక్స్ట్ అనుకునే వ్యక్తిని ఎవరైనా చంపాలనుకుంటారా? రతన్ టాటా లాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉంది.. వచ్చింది!! రతన్ టాటా లాంటి వ్యాపార దిగ్గజాన్ని చంపేందుకు అప్పట్లో ఓ గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు!

అవును... రతన్ టాటాను ఓ గ్యాంగ్ స్టర్ చంపాలని ప్రయత్నించాడు. ఈ విషయాలను గతంలో ఆయన ఓ సారి పంచుకున్నారు! కెరీర్ ప్రారంభంలో తనను ఓ ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ బెదిరించాడని.. వేరే వాళ్లతో చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా తనను చంపేందుకు ప్రయత్నించాడని రతన్ టాటా వెళ్లడించారు.

వివరాళ్లోకి వెళ్తే... రతన్ టాటా కెరీర్ ప్రారంభంలో ఉండగా ఓ గ్యాంగ్ స్టర్ ఆయనను చంపాలని ప్రయత్నించాడు. అప్పట్లో టెల్కో అని పిలవడే టాటా మోటార్స్ లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూపుకు వ్యతిరేకంగా ఓ యూనియన్ ను కంట్రోల్ చేసేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు.

ఇందులో భాగంగా అల్లరి మూకలతో కలిసి టాటా మోటార్స్ లో దాడులకు తెగపడ్డాడు. అయితే ఈ అల్లర్లకు పూర్తి భిన్నంగా ఆలోచించారు రతన్ టాటా. ఈ మేరకు.. సదరు గ్యాంగ్ స్టర్ ని బుజ్జగించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం అతడిని తనతో శాంతి చర్చలు జరపడానికి రావాలని ఆహ్వానించారు.

కానీ గ్యాంగ్ స్టర్ మాత్రం టాటా మోటార్స్ ప్లాంట్ లోని కార్మికులను బెదిరించడం మొదలుపెట్టాడు.. ఒకానొక సమయంలో తన ముఠాతో ప్లాంట్ లోకి ఎంటరై.. కార్మికులపై కత్తులతో దాడికి దిగాడు. అధికారులనూ కత్తులతో పొడిచి ఆ ప్లాంట్ మొత్తం మీద భయానక వాతావారణాన్ని సృష్టించాడు.

అయితే... ఆ గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా బెదరలేదు, తలవంచనూ లేదు. దీంతో... సదరు గ్యాంగ్ స్టర్ సమ్మెకు పిలుపునిచ్చాడు. దీంతో... అతడికి బయపడి కార్మికులు ప్లాంట్ కు రావడం మానేశారు. దీంతో.. కార్మికులను ఆదుకేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు రతన్ టాటా రోజుల తరబడి అక్కడే మకాం వేసి పనులు పూర్తి చేశారు.

ఇలా చాలా రోజుల పాటు ప్లాంట్ లోనే రతన్ టాటా మకాం వేసి కార్మికులకు ధైర్యం చెబుతూ, తాను దగ్గరుండి పనులు చూసుకున్నారు. ఇలా సాగిన ఆయన పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. జైలుకు పంపించారు.

కొన్ని రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు సదరు గ్యాంగ్ స్టర్. అనంతరం రతన్ టాటాపై మరింత పగ పెంచుకుని బయటకు వచ్చి.. ఆయనను చంపేందుకు తన కాంపిటేటర్స్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇదే సమయంలో... టాటా గ్రూపు కార్మికులకు అల్టిమేటం జారీ చేశాడు.

ఇలా సదరు గ్యాంగ్ స్టర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బెదిరింపులకు దిగినా.. అతడి బెదిరింపుల రతన్ టాటా తలవంచలేదు. ఆయన పట్టుదల ముందు రౌడీఇజం తలవంచి పక్కకు తప్పుకుంది!

Tags:    

Similar News