గాలి కేసులో తీర్పు మే 6న...తర్వాత జగన్ కేసు ?

ఇదిలా ఉంటే ఓబులాపురం గనుల విషయంలో అక్రమంగా తవ్వకాల విషయంలో సీబీఐ పుష్కర కాలం కంటే ముందే గాలి అండ్ కో మీద కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తూ వచ్చింది.;

Update: 2025-03-29 21:45 GMT
గాలి కేసులో తీర్పు మే 6న...తర్వాత జగన్ కేసు ?

ఏపీ కర్ణాటక పొరుగు రాష్ట్రాలు ఇక రాజకీయ నాయకులు కేసులు కూడా అలాగే ఉన్నాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డికి ఏపీ రాజకీయాల్లో సంబంధాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఓబులాపురం గనుల విషయంలో అక్రమంగా తవ్వకాల విషయంలో సీబీఐ పుష్కర కాలం కంటే ముందే గాలి అండ్ కో మీద కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తూ వచ్చింది.

ఇది సరిగ్గా జరిగింది 2011 ప్రాంతంలో అదే ఏడాది సెప్టెంబర్ 4న గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తరువాత గాలి జనార్ధనరెడ్డి చాలా కాలం జైలు జీవితం అనుభవించి బెయిల్ మీద విడుదల అయ్యారు. ఇక ఈ కేసు అలా కొనసాగుతూ వస్తోంది.

ఇకీ చూస్తే కనుక 2012 మేలో జగన్ అరెస్టు జరిగింది. జగన్ అయితే ఏకంగా 16 నెలలకు పైగా జైలు జీవితం అనుభవించారు. జగన్ కేసు కూడా సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ రెండు కేసులలో మరో పోలిక ఏమిటి అంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ కేసులను విచారించారు. ఆయనే పూర్తి స్థాయిలో ఈ కేసులలోని అన్ని విషయాలను వెలికి తీసారు.

ఇక గాలి జనార్ధనరెడ్డి కేసులో సీబీఐ కోర్టులో ఏళ్ళ తరబడి విచారణ జరిగింది. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే గాలి కేసులో తుది తీర్పుని సీబీఐ కోర్టు మే నెల 6వ తేదీన వెలువరించనుంది అన్నది. అంటే ఆ రోజున గాలి జనార్ధనరెడ్డి జాతకం తేల్చనుంది అన్న మాట. గాలి కేసులో ఏకంగా 3,400కి పైగా డాక్యుమెంట్లను విచారించిన కోర్టు అదే విధంగా 219 మంది సాక్షులను కూడా విచారించింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఈ కేసులో విచారణ సాగింది అని అంటున్నారు.

ఇక గాలి కేసులో సీబీఐ రంగంలోకి దిగింది 2009లో అయితే ఆయన అరెస్ట్ 2011లో జరిగింది అని గుర్తు చేస్తున్నారు. మొదటి చార్జిషీట్ 2011లో వేశారు అని అంటున్నారు. ఆ తరువాత ఈ కేసు చాలా స్పీడ్ గానే ముందుకు సాగింది.

మరి గాలి అరెస్టు అయిన ఏడెనిమిది నెలల తరువాత జగన్ అరెస్టు అయ్యారు మరి జగన్ కేసులో కూడా విచారణ వేగవంతం కావాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ కేసు విచారణ కూడా సీబీఐ కోర్టులో సాగుతోంది. గాలి కేసులో తీర్పుని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ వైఎస్ జగన్ కేసు విషయంలో కూడా ఏడెనిమిది నెలలలో తుది తీర్పు వెలువడనుందా అన్న చర్చ సాగుతోంది. ఈ కేసులో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయంగా ఉంది. మొత్తం మీద గాలి కేసుకు ఒక లాజికల్ ముగింపు వస్తున్న వేళ అంతా జగన్ కేసు గురించి మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయింది.

జగన్ కేసు విషయం తీసుకుంటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీబీఐ కేసు ఫైల్ చేసింది. తన తండ్రి వైఎస్సార్ రాజకీయ పలుకుబడిని ఆసరాగా తీసుకుని క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు అన్నది ప్రధాన అభియోగం. అయితే ఈ క్విడ్ ప్రోకో ఎలా అన్నది నిరూపిచడం మీదనే ఈ కేసు ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News