గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు కన్నుమూత!
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేర్కొన్న విధంగా వారు జీవించి ఉన్న అతి వృద్ధ కవలలు మాత్రమే కాదు, అతి పెద్ద ఆడ కవలలు కూడానట!
ఇటీవల ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న జువాన్ పెరేజ్ మోరా (114) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలు లోరీ - జార్జ్ షాపెల్.. 62 సంవత్సరాల వయస్సులో మరణించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది!
అవును... గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో అతి పెద్ద వయసున్న కవలలు అనే రికార్డును కలిగి ఉన్న లోరీ - జార్జ్ షాపెల్ లు ఏప్రిల్ 7 న పెన్సిల్వేనియా యూనివర్శిటీలోని ఆసుపత్రిలో తెలియని కారణాల వల్ల మరణించారని అంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేర్కొన్న విధంగా వారు జీవించి ఉన్న అతి వృద్ధ కవలలు మాత్రమే కాదు, అతి పెద్ద ఆడ కవలలు కూడానట!
వీరిలో జార్జ్.. యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రదర్శనలు ఇచ్చే దేశీయ గాయకుడిగా వృత్తిని కలిగి ఉండగా.. లోరీ ట్రోఫీ గెలుచుకున్న టెన్-పిన్ బౌలర్ అని చెబుతున్నారు! లోరీ - జార్జ్ సెప్టెంబర్ 18, 1961న యూఎస్ లోని పెన్సిల్వేనియాలో జన్మించారు. వారు తలలు రెండూ పాక్షికంగా కలిసి ఉండగా.. వారి మెదడులో 30 శాతం, ముఖ్యమైన రక్త నాళాలలను పంచుకున్నారని అంటున్నారు!
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెల్లడించినట్లుగా... వారు ఒకరి అభిరుచులకు మరొకరు సమయం కేటాయించేవారని.. విడివిడిగా కూడా స్నానం చేసేవారని చెబుతున్నారు. 1997లో ఒక డాక్యుమెంటరీలో.. తాము ఎప్పటికీ విడిపోవాలని కోరుకోలేదని వారు వ్యక్తం చేశారని తెలుస్తుంది. లోరీకి సామర్థ్యం ఉంది కానీ జార్జ్ కు వెన్నుపూస వ్యాధి సోకడంతో నడవలేకపోయేవారు! ఫలితంగా.. వీల్ చైర్ టైపులో ఉండే స్టూల్ లో కూర్చుని ఉండేవారు!
ఈ అవిభక్త కవలలు పెన్సిల్వేనియాలోని డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో స్వతంత్రంగా నివసించారని.. వారు ప్రతి ఒక్కరికి వారి స్వంత గదిని కలిగి ఉన్నారని.. ఎవరి రూం లో వారు ప్రత్యామ్నాయ రాత్రులు గడిపారని.. సాధ్యమైనంతవరకు వారి స్వంత వ్యక్తిగత జీవితాలను గడపడానికి ప్రయత్నించారని చెబుతున్నారు.