పవన్ కల్యాణ్ జీ త్వరగా కోలుకోండి.. బీజేపీ మంత్రి ట్వీట్ వైరల్

దీనికి తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చేసిన ట్వీటే ఉదాహకరణగా చెబుతున్నారు.

Update: 2025-02-10 08:08 GMT

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై బీజేపీ అత్యంత వాత్సల్యం ప్రదర్శిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరేందుకు పవన్ కల్యాణ్ ప్రధాన కారణంగా భావిస్తున్న కమల నాథులు.. పవన్ పై విపరీతమైన ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. దీనికి తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చేసిన ట్వీటే ఉదాహకరణగా చెబుతున్నారు.

జనసేన ఆవిర్భావం నుంచి బీజేపీతో పవన్ కల్యాణ్ స్నేహపూర్వకంగా నడుచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ విషయంలో పవన్ గట్టి మద్దతుదారుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అంటే ప్రధాని కూడా అంతే ప్రాధాన్యమివ్వడం చూస్తూనే ఉన్నాం. ఇక గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ సమస్యతో ఆయన విధులకు హాజరుకావడం లేదు. గతవారం జరిగిన క్యాబినెట్ మీటింగుకు సైతం పవన్ రాలేకపోయారు. దీంతో ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా స్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ధన్యవాదాలు, మీరు నాపై చూపిన సానుభూతి, మీ మాటలు నాకు అపారమైన శక్తినిచ్చాయంటూ పవన్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News