జనసేన పొత్తుతో బీజేపీ అంతలా నష్టపోయిందా...

దీని మీద రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చూస్తే ఆలోచన పెంచేలా ఉంది.

Update: 2023-12-06 03:15 GMT

జనసేన అసలు తెలంగాణాలో ఎందుకు పోటీ చేసింది. ఇది పెద్ద ప్రశ్న. పోటీ చేయాలన్న ఆలోచన వస్తే రావచ్చు కానీ ఎక్కడా ఎపుడూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోని బీజేపీకి జనసేనను చేరదీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది. ఇది కూడా మౌలికమైన ప్రశ్నగానే చూడాలి.

ఈ పరిణామం వల్ల జనసేనకు ఏమీ ఒరిగింది లేదు. పైగా పరువు పోయింది. కానీ బీజేపీకి మాత్రం బిగ్ లాస్ అయింది అని అంటున్నారు. దీని మీద రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చూస్తే ఆలోచన పెంచేలా ఉంది.

ఆయన ఏమంటున్నారు అంటే ఆ ఎనిమిది సీట్లు జనసేనకు ఇవ్వకపోతే బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగేది. ఆంధ్ర పార్టీలు టీడీపీ, వైసీపీ దూరంగా వుంటే అసలు జనసేన తెలంగాణాలో ఎందుకు పోటీ చేసిందో అర్ధం కాలేదు అని. నిజంగా కూకట్ పల్లి సీట్లో నలభై వేల దాకా జనసేన తెచ్చుకుంది. జనసేన అభ్యర్ధి ప్రేమ్ కుమార్ బీజేపీకి చెందిన వారే. అక్కడ జనసేన పోటీ చేసి ఉంటే గెలుపు దిశగా కూడా వచ్చి ఉండేవారేమో. లేదా ఓట్లు అంతకు డబల్ అయినా అవవచ్చు.

అంతే కాదు మిగిలిన సీట్లలో కూడా అదే జరిగి ఉండేది అని అంటున్నారు. జనసేనకు వచ్చిన రెండు మూడు వేల కంటే పదింతలు అయినా బీజేపీ ఒక్కో సీట్లులో తెచ్చుకునేది అని కూడా అంటున్నారు. అపుడు బీజేపీకి మరింత బేస్ తెలంగాణాలో ఏర్పడేది అని ఒక విశ్లేషణ ఉంది. ఇప్పటికి మాత్రం బీజేపీ ఏమీ తక్కువ తినలేదు.

ఏకంగా 36 లక్షల ఓట్లను తెచ్చుకుంది. ఇది చాలా మంచి నంబరే. పైగా ఉత్తర తెలంగాణాలో ఆ పార్టీ తన ఓటు బ్యాంక్ ని పెంచుకుంటూ పోతోంది. ఇది మంచి పరిణామంగానే కమలనాధులు చూస్తున్నారు. ఇక మరో వైపు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఫలితాల మీద ఒకింత సంతృప్తినే వ్యక్తం చేశారు. తాము అంతకంతకూ గ్రాఫ్ పెంచుకుని ఎదుగుతున్నామని కూడా అన్నారు.

బీజేపీకి తాను అనుకున్నట్లుగా డబుల్ డిజిట్ నంబర్ లో సీట్లు సాధించకపోయినా బీఆర్ఎస్ ని ఓడిపోవడంతో ఒక మంచి చాన్స్ దక్కిందని అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ. అలా రెండు జాతీయ పార్టీల మధ్య జరిగే ఫైట్ లో ఏదో నాటికి తమకు అధికారం తప్పకుండా దక్కుతుంది అని బీజేపీ వ్యూహకర్తలకు ఆశ ఉంది.

ఇక జనసేనతో పొత్తు వల్ల నష్టం ఏమీ జరగలేదని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి అంటున్నా ఆ పార్టీ ఫ్యూచర్ లో మాత్రం ఇంకా పకడ్బంధీగా అడుగులు వేస్తుంది అని అంటున్నారు. అంతే కాదు ఈ ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి తగిన గుణపాఠాలు కూడా నేర్చుకుని మొత్తం చక్కదిద్దుకుంటుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News