భారత్ కు దూరం పాక్ కు చేరువ... బంగ్లాలో ఈ మార్పు చూశారా?

అవును... హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Update: 2025-02-23 20:30 GMT

1971లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు విడిపోయిన తర్వాత తొలిసారిగా ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ప్రధానంగా షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత యూనస్ నేతృతంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమయంలో... భారత్ కు దూరం, పాక్ కు చేరువ అనే సూత్రాన్ని బంగ్లాదేశ్ పాటిస్తున్నట్లు చెబుతున్నారు.

అవును... హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ కు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే 1971 తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈ విషయాన్ని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి!

ప్రస్తుతం పలు మీడియా వర్గాలు వెల్లడించిన విషయాల ప్రకారం... పాకిస్థాన్ ప్రభుత్వం ఆమోదించిన మొదటి కార్గో కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి బంగ్లాలోని ఢాకాకు బయలుదేరింది! వాస్తవానికి ఈ నెల మొదట్లోనే పాక్ నుంచి బంగ్లాకు 50,000 టన్నుల బియ్యన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారైనట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రికలో ఈ మేరకు ఓ కథనం ప్రత్యక్షమైంది! ఇందులో... 1971 తర్వాత ఫస్ట్ టైమ్ పాకిస్థాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ (పీ.ఎన్.ఎస్.సీ) నౌక బంగ్లా ఓడరేవుకు సరుకును తీసుకెళ్తోంది. ఇది ఇరుదేశాల మధ్య సముద్ర వాణిజ్య సంబంధాలలో ఓ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోందని వెల్లడైంది.

ఇక.. ఈ రవాణా రెండు దశల్లో పూర్తవుతుందని.. ఫస్ట్ ట్రిప్ లో భాగంగా ఇప్పుడు ఇరవై ఐదు వేల టన్నుల బియ్యం తరలించారని వెల్లడించింది. మిగిలిన బియ్యం మార్చి ఫస్ట్ వీక్ లో పంపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా.. గత ఏడాది డిసెంబర్ లో 53 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ పాక్ నుంచి బంగ్లాకు కార్గో షిప్ వచ్చినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

కాగా... 1971లో తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. అయితే.. ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఇరుదేశాల మధ్య జరుగుతున్నట్లు చెబుతున్న తాజా వాణిజ్య ఒప్పందాలు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News