వీడెవడండీ బాబూ.. భార్య ప్రైవేట్‌ పార్టుకు గొలుసులతో తాళం!

తన భార్యకు వేరేవారితో అక్రమ సంబంధాలున్నాయనే కారణంతోనే అతడు ఇలా చేశాడు. ఈ కారణంతోనే రోజూ తన భార్యను తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు.

Update: 2024-07-03 14:30 GMT

ప్రముఖ జర్నలిస్టు, రచయిత తాపీ ధర్మారావు రాసిన 'ఇనుప కచ్చడాలు' అనే పుస్తకం చదివారా మీరు?.. పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తమ భార్యలు వేరే వారితో అక్రమ సంబంధాలు కొనసాగించకుండా వారి యోనిలకు తాళాలు వేసి వెళ్లేవారు. ఈ తాళాలు విభిన్నమైన సైజుల్లో ఉండేవి. మూత్రం పోసుకోవడానికి మాత్రమే ఖాళీ ఉంచి.. యోనికి తాళాలు వేసేసేవారు. ఈ విషయాలను ఎంతో పరిశోధన చేసి తాపీ ధర్మారావు 'ఇనుప కచ్చడాలు' పుస్తకంలో రాశారు.

ఇప్పుడు అచ్చం ఇలాగే మహారాష్ట్రలో ఒక వ్యక్తి తన భార్య ప్రైవేటు పార్టుకు తాళం బిగించాడు. తన భార్యకు వేరేవారితో అక్రమ సంబంధాలున్నాయనే కారణంతోనే అతడు ఇలా చేశాడు. ఈ కారణంతోనే రోజూ తన భార్యను తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. తన భార్యకు వేరే వాళ్లతో అక్రమ సంబంధాలున్నాయని.. ఆమె ప్రైవేటు పార్టుకు తాళం వేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించివాడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌ దేశానికి చెందిన దంపతులు మహారాష్ట్రలోని చించివాడ్‌ లో ఉంటున్నారు. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతడి భార్య ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో తాను విధుల నిర్వహణకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే తన భార్య వేరే వారితో అక్రమ సంబంధాలు నెరపుతోందని అతడు అనుమానించాడు.

Read more!

తనకు ఏ పాపం తెలియదని ఆమె చెబుతున్నా వినకుండా.. అనుమానంతో ఆమెను తిట్టడం, కొట్టడం చేస్తున్నాడు. నిత్యం ఆమెతో గొడవపడేవాడు.

అతడు సెక్యూరిటీ గార్డు కావడంతో కొన్నిసార్లు రాత్రిళ్లు కూడా అతడికి డ్యూటీ పడేది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున డ్యూటీ నుంచి ఇంటికొచ్చాక ఆమెతో గొడవపడేవాడు. ఈ రాత్రంతా ఎవరితోనో గడిపావని తన భార్యను నిందించేవాడు. ఇలాగే ఒకరోజు ఆమెతో గొడవ పడి చితకబాదాడు. అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్న అతడు తన భార్య ఒంటిపైన బట్టలన్నింటిని తొలగించాడు. ఒక బ్లేడు తెచ్చి ఆమె ప్రైవేటు భాగాలపై దాడి చేశాడు. దీంతో ఆమెకు రక్తస్రావమవుతున్నా అతడి దాష్టీకం ఆగలేదు. తన భార్య ప్రైవేట్‌ పార్టును ఇనుప గొలుసుతో చుట్టేసి.. దానికి తాళం వేశాడు.

దీంతో నొప్పి భరించలేక అతడి భార్య పెద్దగా కేకలు వేసింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను చూసి భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు భార్య ఫిర్యాదుతో అనుమానపు భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News

eac