హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాల్లో 19 శాతం తగ్గుదల

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇళ్లు, స్థలాల రేట్లు తగ్గాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-25 07:22 GMT
Hyderabad Real Estate

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇళ్లు, స్థలాల రేట్లు తగ్గాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ వంటి కారణాల నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్ పడిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. 2025 మొదటి త్రైమాసికంలో హైదరాబాద్ లో హౌసింగ్ మార్కెట్ లో 19 శాతం క్షీణత ఉందని తెలిపింది.

2025 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో గృహ మార్కెట్ పడిపోయిందని, టాప్ 9 నగరాల్లో అమ్మకాలు 23% తగ్గాయని వెల్లడించింది. గత రెండు త్రైమాసికాల్లో కూడా ఇలాగే క్షీణత ఉందని, వరుసగా మూడో త్రైమాసికంలో విపరీతమైన క్షీణత ఉందని వెల్లడైంది. అయితే, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలలోని అమ్మకాలలో 10% పెరుగుదల నమోదైందని తెలిపింది. ఈ క్రమంలోనే బెంగళూరు కొత్త వెంచర్ ల లాంచ్‌లలో 17% పెరుగుదల ఉందని చెప్పింది.

ఇంటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయని, భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక ఆందోళనల మధ్య పెట్టుబడిదారుల జాగ్రత్త వల్లే ఇళ్ల అమ్మకాల్లో తగ్గుదల ఉందని తెలిపింది. ఇళ్ల అమ్మకాల్లో అత్యధికంగా ఢిల్లీలో 38 శాతం తగ్గుదల ఉండగా పుణెలో 24 శాతం, హైదరాబాద్ లో 19 శాతం, ముంబైలో 10 శాతం తగ్గుదల ఉంది. ఇక, కోల్ కతాలో 4 శాతం, చెన్నైలో 5 శాతం, బెంగళూరులో 10 శాతం అమ్మకాల్లో మెరుగుదల ఉంది.

Tags:    

Similar News