వీర్రాజు దూకుడు.. పదవి కోసం పాట్లు ..!
ఏపీ బీజేపీ చీఫ్ పదవిని వచ్చే నెలలో మార్పు చేయనున్నట్టు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.;

ఏపీ బీజేపీ చీఫ్ పదవిని వచ్చే నెలలో మార్పు చేయనున్నట్టు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి.. త్వరలోనే రిటైర్ కానున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న ఆమె.. పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నా.. అంతర్గత చిచ్చులను మాత్రం ఆమె పరిష్క రించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో మార్పు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. దీంతో సదరు పదవికి డిమాండ్ పెరిగింది.
ఏపీ బీజేపీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు ముగ్గురు నుంచి నలుగురు కీలక నాయకులు పోటీ పడుతున్నారు. వీరిలో ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న మాధవ్, సోము వీర్రాజులు మరింత గట్టిగా తలపడుతు న్నారు. సోము వీర్రాజు ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పుతున్న విషయం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. ఆయన ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇది కూడా ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయమే. వాస్తవానికి పాకాల సత్యనారాయణ(బలిజ సామాజిక వర్గం)కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలని పురందేశ్వరి ప్రతిపాదించారు.
కానీ.. ఆయనను తోసిపుచ్చి సోము వీర్రాజు ముందుకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం వంటివి కలిసి వచ్చాయి. ఫలితంగా ఎంత మంది బరిలో ఉన్నా.. ఎంత పరిచయాలు ఉన్నా.. సోము ముందు నిలవలేక పోయారు. ఇక, ఇప్పుడు కూడా.. అదే బాటలో సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలతో కూడా భేటీ అయ్యారు.
తన మనసులో మాటలను కూడా చెప్పేశారు. ఇక, బీజేపీ పెద్దలు, ఆర్ ఎస్ ఎస్ ముఖ్యులతోనూ సోము భేటీ కానున్నారు. ఇది కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సోము ను కాదని.. మరొకరికి ఈ చీఫ్ పదవిని ఇచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుందన్నది ప్రశ్న. పైగా.. ప్రస్తుతం వైసీపీని ఢీ అంటే ఢీ అనేలా ఎదుర్కొనడం కంటే కూడా.. వచ్చే ఎన్నికల నాటికి.. ఆ పార్టీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే వ్యూహం దిశగానే బీజేపీ పనిచేయాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్నవారిలో సోము కే సాధ్యమవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నే సోముకు కేంద్రంలోని పెద్దలు జైకొట్టి చీఫ్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనిసమచారం.