మొన్న లోకేష్, నేడు కల్యాణ్ రామ్... పుకార్లకు ఫుల్ స్టాప్!

కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్య గ్యాప్ ఉందని;

Update: 2025-03-31 12:43 GMT
మొన్న లోకేష్, నేడు కల్యాణ్  రామ్... పుకార్లకు ఫుల్  స్టాప్!

కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్య గ్యాప్ ఉందని.. అందుకే సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ లు, ఫోటోలు కనిపిస్తే అక్కడ కాస్త రచ్చ జరిగేదనే ప్రచారం విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఫలితంగా... జూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు నారా లోకేష్ కు మధ్య గ్యాప్ ఉందని.. అందుకే టీడీపీ కార్యక్రమాలకు, ప్రచారాలకు జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని ప్రచారం విపరీతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో వరుసగా జరిగిన రెండు ఘటనలు ఈ ప్రచారాలకు బ్రేక్ వేసేలా చేశాయనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ఫ్లాంట్ ను లోకేష్ ప్రారంభించారు. ఈ సమయంలో.. నూజివీడు మండలం సీతారాంపురం దగ్గర లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ సందడి చేశారు.

ఈ సమయంలో వారి చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ సమయంలో.. అభిమానుల కోరిక మెరకు జూనియర్ ఉన్న ఫ్లెక్సీని మంత్రి లోకేష్ పట్టుకున్నారు.. అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో... మరింత సందడి నెలకొంది. ఇదే సమయంలో.. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదే సమయంలో తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ పనుల్లో కల్యాణ్ రామ్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయంలో తాజాగా ఆయన నరసరావుపేటలో సందడి చేశారు. ఈ సమయంలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

ఈ సమయంలో నరసరావుపేటలోని అనేక చోట్ల భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నందమూరి యువసేన పేరుతో ఉన్న అభిమానుల సంఘం.. కల్యాణ్ రామ్ రాక నేపథ్యంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ లతో కల్యాణ్ రామ్ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా... లోకేష్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న జెండాను పట్టుకుని ప్రదర్శించారు. దీంతో.. ఒక్కసారిగా అక్కడ సందడి రెట్టింపయ్యిందనే చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట సందడి మొదలుపెట్టింది.

దీంతో... గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కు.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్య గ్యాప్ ఉందని.. పార్టీ పగ్గాలు, మొదలైన విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయనే ప్రచారం అసత్యమని, అలాంటివి ఏమీ లేవనే క్లారిటీ మొన్న లోకేష్ ఇస్తే.. ఇప్పుడు ఆ క్లారిటీని కల్యాణ్ రామ్ మరింత బలపరిచారని అంటున్నారు.



Tags:    

Similar News