16 ఏళ్ల వాడితో 30 ఏళ్ల కింద లైంగిక బంధం.. ఐస్ ల్యాండ్ మంత్రి రిజైన్
ఐస్ లాండ్.. అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్ లాండ్. యూరప్ లో జన సాంద్రత తక్కువగా ఉన్న దేశం.;
పశ్చిమ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఇది.. ఎప్పుడో సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు చేసిన తప్పు.. దేశ మంత్రి అయ్యాక కూడా వెంటాడుతుంది అనేందుకు సాక్ష్యం ఇది.. ఐస్ లాండ్.. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని ద్వీప దేశం. అగ్ని పర్వతాలు బద్ధలయ్యే సందర్భంలో తప్ప పెద్దగా పేరు వినిపించని దేశం ఇది. తాజాగా ఈ దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. ఇది పురుష మంత్రి అయితే సమస్య కాకపోయేది..
మహిళా మంత్రి కావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఐస్ లాండ్.. అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్ లాండ్. యూరప్ లో జన సాంద్రత తక్కువగా ఉన్న దేశం. చురుకైన అగ్నిపర్వతాలు ఉండే దేశం ఇది. ఈ దేశ మహిళా
మంత్రి ఆస్టిల్డర్ లోవా థోర్సోడొట్టిర్.
థోర్సోడొట్టిర్ 30 ఏళ్ల క్రితం అప్పటికి 16 ఏళ్లున్న బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడితో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయమై తీవ్ర వివాదం చెలరేగడంతో ఆస్టిల్డర్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
థోర్సోడొట్టిర్ ప్రస్తుత వయసు 58. ఆమె 28 ఏళ్ల వయసులో ఉండగా 16 ఏళ్ల బాలుడితో సంబంధం పెట్టుకున్నది. అయితే, ఇప్పుడు మంత్రి ఆమె విద్య, శిశు సంక్షేమ శాఖలను చూస్తుండడం గమనార్హం. 30 ఏళ్ల కిందట ఆమె
మతపరమైన వర్గానికి కౌన్సిలర్ గా ఉండగా.. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన బాలుడితో సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తర్వాత వీరికి బిడ్డ కూడా జన్మించాడు.
కొడుకు పుట్టాక తనను ఆమె దూరం పెట్టిందని బాలుడు ఆరోపించాడు. 18 ఏళ్ల పాటు కుమారుడి సంరక్షణకు డబ్బు చెల్లించినట్లు చెప్పాడు. అయితే, ఆస్టిల్డర్ మమ్మల్ని కలవనివ్వలేదని తెలిపాడు.
కాగా, ఐస్‌లాండ్ చట్టాల ప్రకారం.. మైనర్ తో గురువు లేదా సంరక్షకులు వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం. అలా చేసినవారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, మంత్రి వ్యవహారాన్ని ఆమె బంధువు దేశ ప్రధానమంత్రికి చేరవేశారు. తాజా ఇంటర్వ్యూలో మంత్రి తప్పును అంగీకరించారు. విమర్శలు వెల్లువెత్తడంతో రాజీనామా చేశారు.