సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్... కత్తెర పడితే మినిమం రూ.లక్ష!

అవును... తన కత్తెరతో చాలా మంది సెలబ్రెటీలను స్టైల్ చేసిన వ్యక్తి సంవత్సరాలుగా సంచలనంగా మారాడు.;

Update: 2025-03-23 18:15 GMT

సాధారణంగా హెయిర్ కట్ కోసం సెలూన్ కు వెళ్తే ఎంత ఖర్చవుతుంది? రూ.100 నుంచి మొదలై గరిష్టంగా రూ.500 వరకూ ఉంటుంది.. ఇంకా అనుకుంటే.. రూ.100 వరకూ ఉంటుంది. కానీ... ఇప్పుడు చెప్పుకోబోయే సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ దగ్గర హెయిర్ కట్ చేయించుకుంటే... ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరు ఆ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ అనేది ఇప్పుడు చూద్దామ్..!


అవును... తన కత్తెరతో చాలా మంది సెలబ్రెటీలను స్టైల్ చేసిన వ్యక్తి సంవత్సరాలుగా సంచలనంగా మారాడు. సెలబ్రెటీ హెయిర్ డ్రెస్సర్ గా పేరు సంపాదించుకొన్ని అలిమ్ హమీమ్.. చాలా మంది స్టార్ హీరోలు, క్రికెటర్ల లుక్ లను మార్చాడు. 'యానిమల్' లో రణ్ బీర్ కపూర్ నుంచి 'వార్' లో హృతిక్ రోషన్, 'జైలర్' లో రజనీ కాంత్ లుక్ వరకూ అదంతా అలిమ్ చేతుల మాయాజాలమే!


ఇక విరాట్ కొహ్లీ న్యూ లుక్, మహేంద్ర సింగ్ ధోనీ వింటేజ్ లాంగ్ హెయిర్ లుక్ చాలా మందిని ఆకర్షించడం వెనుక ఉన్న హెయిర్ స్టైలిస్ట్ ఈ అలమ్. ఈ విధంగా... గ్లామర్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, సెలబ్రెటీలు కోరుకునే హెయిర్ స్టైలిస్ట్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఆలిమ్ అంత గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు.


వాస్తవానికి అలిమ్ తండ్రి దివంగత హకీమ్ కైరన్వీ.. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, సునీల్ దత్, శశికపూర్ లతో పాటు అప్పట్లో చాలా మంది సెలబ్రెటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసేవారు. ఆయన 39 ఏళ్ల వయసులోనే మరణించారు. అప్పటికి ఆలిమ్ వయసు 9 ఏళ్లు మాత్రమే. ఈ సమయంలో కాలక్రమేనా తండ్రి స్థాపించిన వారసత్వాన్ని ఆలిమ్ ముందుకు తీసుకెళ్లాలని భావించారు.


ఈ క్రమంలో 1990లో ఆలిమ్ కు గుర్తింపు లభించింది. చాలామంది నటులు ఆయన వద్దకు రావడం ప్రారంభించారు. ఇందులో భాగంగా... సల్మాన్ ఖాన్, సైఫ్ అలిఖాన్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్, ఫర్దీన్ ఖాన్ లు సుమారు 20 ఏళ్ల క్రితం నుంచి అతని క్లయింట్స్ గా మారారు. ఇదే సమయంలో.. రజనీకాంత్, ప్రభాస్, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి సౌత్ ఇండియా స్టార్లకు కూడా ఆలిమ్ హెయిర్ స్టైల్ చేశాడు.


ఈ సందర్భంగా... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆలిమ్.. తాను ఎంత ఫీజు వసూలు చేస్తాననేది అందరికీ తెలుసని.. ఇందులో భాగంగా.. తన ఫీజు రూ. లక్ష నుంచి ప్రారంభమౌతుందని.. అది బేసిక్ ప్రైస్ అని చెప్పుకొచ్చారు!

Tags:    

Similar News