‘ఐఐటీయన్ బాబా’కు మతిస్థిమితం లేదా?.. పంపించేశారంట!

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభ మేళాలో వెరైటీ సాధువులు, సన్యాసులు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-19 10:30 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభ మేళా అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మహాకుంభ మేళాలో వెరైటీ వెరైటీ సాధువులు, స్పెషల్ క్వాలిఫైడ్ సన్యానులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారని అంటున్నారు. వారిలో ఒకరు అభయ్ సింగ్ అలియాస్ ఐఐటీయన్ బాబా. ఈ సమయంలో ఇతడి గురించి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభ మేళాలో వెరైటీ సాధువులు, సన్యాసులు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకుని బాబాగా మారిన ఓ సాధువు హల్ చల్ చేయగా.. అతడి వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ సమయంలో... మహాకుంభ మేళాకు వచ్చిన ఈ ఐఐటీయన్ బాబాను ఆశ్రమం నుంచి పంపించేశారనే విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలను వెల్లడిస్తూ తాజాగా నిప్పులు చెరిగాడు ఐఐటీయన్ బాబా. ఈ సందర్భంగా తనకు మతిస్థితిమితం లేదని అంటున్నారంటూ.. అలా అంటున్నవారిపై ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా స్పందించిన ఐఐటీయన్ బాబా... అర్ధరాత్రి సమయంలో నిర్వాహకులు తనను వెళ్లిపోమన్నారని.. తనకు మతి స్థితిమితం లేదని అన్నారని తెలిపారు. తనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి తనకంటే మానసిక స్థితి తెలిసిన సైకాలజిస్టులు ఇక్కడ ఉన్నారా అంటూ ఆయన మండిపడ్డారు. అయితే... ఆశ్రమ గురువు మహంత్ సోమేశ్వర్ పూరీని దూషించడమే ఐఐటీయన్ బాబాను ఆశ్రమం నుంచి పంపించేయడానికి గల కారణం అని అంటున్నారు.

Tags:    

Similar News