గుంటూరులో ఐపీఎస్ వరుడు.. డాక్టర్ వధువు.. పెళ్లి రచ్చ రచ్చ...!
అసలు విషయంలోకి వెళితే గుంటూరుకు చెందిన ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ గుజరాత్ కేడర్‌లో పని చేస్తున్నాడు. అతడికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తె.. డాక్టర్ అమ్మాయితో పెళ్లి కుదిరింది.
గుంటూరులో ఓ ఐపీఎస్ వరుడు, మరో డాక్టర్ వధువు మధ్య మంగళవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ పెళ్లిని వధువు తండ్రి రాజకీయ ర్యాలీగా మార్చేయడమే అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే గుంటూరుకు చెందిన ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్ గుజరాత్ కేడర్‌లో పని చేస్తున్నాడు. అతడికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తె.. డాక్టర్ అమ్మాయితో పెళ్లి కుదిరింది. మంగళవారం ఈ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే వధువు తండ్రి ఈ పెళ్లి ర్యాలీని రాజకీయ ర్యాలీగా చేశారు. పైగా ఈ ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్ జెండాలతో హడావిడి చేశారు.
ఆ యువ ఐపీఎస్ అధికారి గుజరాత్ కేడర్‌లో చేస్తున్నాడు. ఇందులోనూ కాంగ్రెస్ జెండాలతో ఆయన పెళ్లిలో ర్యాలీ అంటే గుజరాత్ బీజేపీ ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బంది వస్తుందన్న భయం ఆ ఐపీఎస్‌కు పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ ర్యాలీ తర్వాత ఇరు వర్గాలు దెబ్బలాడుకోవడంతో పెళ్లి ముహూర్తం దాటిపోయి పెళ్లికి బ్రేక్ పడినట్టు తెలిసింది. చివరకు పెళ్లికి వరుడి తల్లిదండ్రులు కూడా తీవ్ర అభ్యంతరం చెప్పారట. అయినా కూడా ఆ కాంగ్రెస్ నేత వెనక్కు తగ్గలేదు.
దీంతో పెళ్లి కుమార్తె తల్లికి గుండెపోటు రావడం.. పెళ్లి చేసుకునేందుకు వరుడు ఒప్పుకోకపోవడం అన్నీ జరిగాయట. అయితే ఇరు వర్గాల పెద్దలు కూర్చొని మాట్లాడుకుని చివరకు బుధవారం పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే బుధవారం అయినా పెళ్లి జరుగుతుందా ? అన్న డౌట్ అయితే ఉంది. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ మాత్రం మంచి అండర్ స్టాండింగ్‌తో ఉన్నట్టు సమాచారం. అందుకే బుధవారం పెళ్లి జరగవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం పెళ్లికుమార్తె ర్యాలీలో కాంగ్రెస్ జెండాలు ఎందుకుని ఆ మాజీ ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు.