హమాస్ చీఫ్ ను హతమార్చిన ఇజ్రాయెల్... సగం కన్ఫాం చేసిన ఐడీఎఫ్!

అవును... హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఐడీఎఫ్.. ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది.

Update: 2024-10-17 16:05 GMT

ఇజ్రాయెల్ – హమాస్ పోరు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు గత ఏడాది అక్టోబర్ లో దాడి చేసినప్పటి నుంచీ గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వణికించేస్తోంది. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. గాజాలో మానవతా సాయం కూడా అందడం లేదని అంటున్నారు.

అయినప్పటికీ హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకునేవరకూ ఐడీఎఫ్ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు కదులుతుంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూ హమాస్ ను చిన్నాభిన్నం చేస్తుందని అంటున్నారు. ఈ సమయంలో హమాస్ అధినేత, అక్టోబర్ 7నాటి దాడుల రూపకర్త యహ్యా సిన్వార్ మృతిచెందినట్లు తెలుస్తోంది.

అవును... హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హతమార్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఐడీఎఫ్.. ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... గాజాలో ఐడీఎఫ్ ఆపరేషన్ల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. వీరిలో యహ్యా సిన్వార్ ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు ప్రకటించింది.

అయితే... ముగ్గురు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ హమాస్ స్పందించలేదు. ఆ ముగ్గురిలో సిన్వార్ ఉన్నట్లు ఐడీఎఫ్ అనుమానిస్తున్నట్లు తెలిపినా.. హమాస్ నుంచి నో రియాక్షన్. దీంతో... సిన్వార్ మరణంపై ధృవీకరణలు మొదలయ్యాయని అంటున్నారు. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.

అయితే.. ఆ ముగ్గురిలో సివారా ఉన్నారా లేదా అనే విషయాన్ని డీ.ఎన్.ఏ. పరీక్ష ద్వారా నిర్ధారిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. సిన్వార్ ఇజ్రాయెల్ జైల్లో ఉన్న సమయంలో అతడి జన్యు సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. వాటి సహాయంతో నిర్ధారిస్తామని సైన్యం పేర్కొంది. దీంతో... ఈ విషయంపై ఐడీఎఫ్ కన్ఫర్మేషన్ పై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News