జగనే హింట్ ఇచ్చేశారు....వైసీపీ నేతలు సర్దుకోవాల్సిందే !

దాంతో వైసీపీలో ఏ మాత్రం డౌట్ ఉన్న లీడర్ అయినా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉండాల్సిందే అని అంటున్నారు.

Update: 2025-02-19 18:30 GMT

ఎవరో చెప్పడం కాదు ఏకంగా అధినేత నుంచే హింట్ వచ్చింది. దాంతో వారు పూర్తి స్థాయిలో సర్దుకోవాల్సిందే అని అంటున్నారు. ఏకంగా మీడియా ముందే బాహాటంగా జగన్ ఈ విషయం చెప్పారు. గతంలో ఏ అధినాయకుడు అయినా ఇలా చెప్పారో లేదో తెలియదు కానీ జగన్ మాత్రం లిస్ట్ ఇదే అని చెప్పేశారు. దాంతో వైసీపీలో ఏ మాత్రం డౌట్ ఉన్న లీడర్ అయినా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉండాల్సిందే అని అంటున్నారు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్ తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని కూటమి ప్రభుత్వం మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. అదే ఊపులో ఆయన కూటమి వద్ద ఉన్న లిస్ట్ ఏంటో చెప్పకనే చెప్పారు.

ఆయన అలా చూపిస్తూ దేవినేని అవినాష్, అలాగే కొడాలి నానిలను కూడా అరెస్ట్ చేస్తారని హింట్ ఇచ్చేశారు. తన సొంత సామాజిక వర్గం నేతలు ఎదగడం బాబుకు ఇష్టం ఉండదు కాబట్టే ఈ అరెస్టులు అని ఆయన దానికి తనదైన పొలిటికల్ కలరింగ్ ఇచ్చారు.

విజయవాడలో కీలకమైన వైసీపీలో ఉన్న ఇద్దరు నేతలను అరెస్ట్ చేసి తీరుతారు అని స్వయంగా జగన్ హింట్ ఇవ్వడం విశేషం. అంతే కాదు తన సొంత సామాజిక వర్గం నేతలు తమ పార్టీకి తనకే మద్దతు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనా విధానం అని జగన్ ఫైర్ అయ్యారు.

ఇక చూస్తే జగన్ చెప్పినట్లుగా దేవినేని అవినాష్ అరెస్టుకు అవకాశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు వైసీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో ఆయన ఒక నిందితుడిగా ఉన్నారని అంటున్నారు. ఇక అవినాష్ చూస్తే టీడీపీ నుంచే పొలిటికల్ గా రాజకీయాలలోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. 2024లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తే దేవిఏని నెహ్రూ పేరు మీద ఉన్న రోడ్డు పేరుని మార్చేసింది. దానికి మహానాడు రోడ్డుగా పేరు పెట్టింది. దాంతో దేవినేని అవినాష్ పట్ల కూటమి పెద్దల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది అని అంటున్నారు.

అలాగే కొడాలి నాని టార్గెట్ అని అందరూ అనుకుంటున్నదే. ఆయన ఏకంగా చంద్రబాబు లోకేష్ ల మీద తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆయన కూడా రేపటి రోజున అరెస్టుకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు. వల్లభనేని దాకా అరెస్ట్ వ్యవహారం వచ్చిన నేపథ్యంలో కొడాలి నానికి ఎంతో దూరం లేదని అంటున్నారు. దాని మీద కొడాలి నానిని మీడియా ప్రశ్నిస్తే అరెస్టులు అన్నవి చిన్న విషయాలు అని లైట్ తీసుకున్నారు. దాంతో ఆయన కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీగా ఉన్నారా అన్న చర్చ వస్తోంది.

వైసీపీలో ఈ ఇద్దరే కాదు మరి కొందరు నేతలను అరెస్ట్ చేయవచ్చు అన్నది ప్రచారంలో ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం ఇదే విషయం చెబుతోంది. అరెస్టులు చేసి తీరుతారు అని ఇదే విషయం జనంలోకి వచ్చిన జగన్ చెప్పడం వెనక ఉన్నది ఏంటి అంటే వైసీపీ లీడర్స్ ని కూటమి ప్రభుత్వం గట్టిగా టార్గెట్ చేస్తోంది అని ఎస్టాబ్లిష్ చేయడానికే అని అంటున్నారు.

అంతే కాదు ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీ అండగా ఉంటుందని జగన్ ఒక భరోసా ఇస్తూనే అరెస్టులు జైలు అన్నది జరుగుతుందని దాని మీద కలవరం చెందాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు అలా చెప్పారని అంటున్నారు. కేవలం ఈ ఇద్దరు నేతలే కాకుండా విజయవాడలో మరింత మంది నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం మీద అటు కూటమి పెద్దలకు ఇటు వైసీపీ పెద్దలకూ క్లారిటీ ఉండడమే విశేషం. సో వైసీపీ నేతలు సర్దుకోవాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News