లడ్డూ ఇష్యూ తరువాత ఫస్ట్ టైం తిరుమలకు జగన్!

మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహరం ఇంకా కొనసాగుతోంది.

Update: 2024-09-25 15:54 GMT

మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహరం ఇంకా కొనసాగుతోంది. అది రాజకీయ రంధిలో పడి కొట్టుకుంటోంది. ఈ ఇష్యూలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని స్వామి లడ్డూ ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసి సరిగ్గా వారం అయింది. అది కాస్తా వైరల్ గా మారి మొత్తం హిందూ సమాజంతో పాటు శ్రీవారి భక్తులు అంతా కూడా కలవరపడ్డారు.

ఈ పరిణామాల క్రమంలో తమ తప్పు లేదని నిరూపించుకోవడానికి వైసీపీ టీడీపీ కూటమిని కౌంటర్ చేసింది. ఏకంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. లేటెస్ట్ గా చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న ఆయన తిరుమలకు రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నరు. ఆ రోజు శనివారం. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు.

లడ్డూ ఇష్యూ ఏపీలో చోటు చేసుకున్న తరువాత తిరుమలను సందర్శించే తొలి ప్రధాన రాజకీయ పార్టీ అగ్ర నేత జగనే అలా అవుతారు. ఎందుకంటే చంద్రబాబు తిరుమలకు ఈ ఇష్యూ తరువాత రాలేదు. పవన్ కళ్యాణ్ తన ప్రాయాశ్చిత్త దీక్షను ముగించి వచ్చే నెల 2న స్వామి దర్శనం చేసుకుంటారు.

ఇక చూస్తే పవన్ కూడా స్వామి దర్శనం కోసం తిరుమలకు కాలినడకన వస్తారని చెబుతున్నారు ఆయన కంటే ముందే జగన్ తిరుమలకు రావడం, అదే విధంగా లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అని అంతా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణ అని జగన్ చెప్పాలనుకోవడం తో ఈ నెల 28న ఏమి జరగనుంది అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకో వైపు చూస్తే అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలలో వైసీపీ క్యాడర్ అంతా ప్రత్యేక పూజలు చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. తిరుమల పవిత్రతను స్వామి వారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వరస్వామి వరి వైభవన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతులను లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో అబద్ధాలు ఆడి చంద్రబాబు అపవిత్రం చేశారు అని జగన్ ట్వీట్ ద్వారా ఆరోపించారు.

అందువల్ల పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ శ్రేణులు అన్నీ ఈ నెల 28న ఏపీవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో పూజలు చేయాలని జగన్ కోరారు. మొత్తం మీద చూస్తే లడ్డూ ఇష్యూలో వైసీపీ ఇపుడిపుడే తేరుకుని ముందుకు సాగుతోందని అంటున్నారు. అదే విధంగా సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ కోరడం ద్వారా తన నిజాయితీని నిలబెట్టుకోవాలని చూసోందని అంటున్నారు. మరో వైపు కోర్టులో పిటిషన్లు ఎటూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే లడ్డూల వ్యవహారం ఏదో ఒకటి తేలేందుకు అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News