అల్లు అర్జున్ కోసం వైఎస్ జగన్... సంచలన వ్యాఖ్యలు!
అయితే... ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకూ సమంజసం? అని జగన్ ప్రశ్నించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కు ఊహించని షాక్ తగిలింది. సంధ్య థియేటర్ లో 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోపక్క ఈ విషయంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది! ఈ సమయంలో వైఎస్ జగన్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును.. సంధ్య థియేటర్ లో 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అని చెప్పిన జగన్... అదే సమయంలో... దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
అయితే... ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకూ సమంజసం? అని జగన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో... తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇప్పుడు ఈ ట్వీట్ ఇటు రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనూ, అటు సిని జనాల్లోనూ సంచలనంగా మారిందని అంటున్నారు! ప్రస్తుతం ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్ లో చిన్న సైజు యుద్ధమే మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.