పార్టీ ఓడితే అంతేనా....వైసీపీలో అంతర్మధనం
వైసీపీ ఓటమి పాలు కావడంతో ఒక్కో నేతా పార్టీని వీడిపోతున్నారు. దీంతో వైసీపీలో అంతర్మధనం జరుగుతోంది.
వైసీపీ ఓటమి పాలు కావడంతో ఒక్కో నేతా పార్టీని వీడిపోతున్నారు. దీంతో వైసీపీలో అంతర్మధనం జరుగుతోంది. అధినాయకుడు జగన్ అయితే తాను ఎంతో సన్నిహితులు అని అనుకున్న వారే పార్టీ జెండాను వీడిపోవడం పట్ల ఇతర నేతల వద్ద ప్రస్తావిస్తూ స్వార్ధపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయని అన్నట్లుగా చెబుతున్నారు.
జగన్ ముఖ్యంగా చెబుతున్నది ఏలూరు జిల్లా మాజీ ప్రెసిడెంట్, వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని విషయంలో అని అంటున్నారు. ఆయనకు ఏమి అన్యాయం చేశామని జగన్ తన సన్నిహితులతో అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు అందుకున్న నేతలే ఇపుడు పార్టీని వీడిపోతున్నారు అని అన్నట్లుగా చెబుతున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నపుడు తామే అసలు సిసలు నేతలుగా చెప్పుకుని తిరిగిన వారు ఓటమి పాలు కాగానే ఇలా జెండాను పక్కన పెట్టి పోవడం పట్ల వైసీపీ అధినాయకత్వంలో అంతర్మధనం చెలరేగుతోంది అని అంటున్నారు.
నమ్మి పదవులు ఇచ్చిన వారు పార్టీని వీడడమేంటని కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. కొంతమంది నేతల పార్టీని ఇలా వీడిపోవడంతో జగన్ సైతం సీరియస్ యాక్షన్ కి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఎవరు వెళ్ళినా పార్టీని నమ్ముకుని ఉన్న వారితోనే నడిపించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
వెళ్ళిన వారిని బతిమాలడం జరగదు అన్నట్లుగానే అధినాయకత్వం ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే మరోసారి విజయం పార్టీకి దక్కినపుడు వారికే అవకాశాలు వస్తాయని కూడా అధినాయకత్వం నేతలకు చెబుతోంది అని అంటున్నారు.
పార్టీ అన్నాక సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే హైకమాండ్ ఒక డెసిషన్ చెబితే దానికి కట్టుబడి ఉండాలని కూడా అధినాయకత్వం చెబుతోంది అంటున్నారు. అలా ఉన్న వారికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కొందరు నేతలు వ్యక్తిగత కారణాలు అంటూ పార్టీని వీడి పోవడం మంచి విధానం కాదని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. మరి కొందరు పార్టీలో ఉన్నపుడు అన్నింటినీ మెచ్చుకుని బయటకు వెళ్ళాక విమర్శలు చేయడం పట్ల కూడా అధినాయకత్వం సీరియస్ గా ఉంది అని అంటున్నారు.
పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నిర్మించుకుని ముందుకు సాగుదాం ఎవరు వెళ్ళినా పట్టించుకోనవసరం లేదని కూడా అధినాయకత్వం ఇతర నేతలకు భరోసా ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. 2029లో వైసీపీ విజయం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారని అదే లెవెల్ ధీమాతో ఉన్న వారే పార్టీలో ఉండగలరని కూడా అంటున్నారు. మొత్తానికి అదేదో పాత సినిమాలో ఆత్రేయ పాట ఉంది. పోతారు పోయేటి వారూ ఇచ్చేయ్ తుది వీడుకోలూ అని. అలా వైసీపీ నుంచి పోతున్న నేతలకు వీడ్కోలు పలుకుతూ తమతో ఉన్న వారితోనే ప్రయాణమని అంటోంది. చూడాలి మరి ఫ్యాన్ పార్టీ అయిదేళ్ళ సుదీర్ఘమైన విపక్ష ప్రయాణం ఎలా సాగుతుందో.