జగన్ గట్టి సంకల్పం...!
అయితే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాకా సాకారం చేయడమే కాదు అందుకోసం విజయవాడ నడిబొడ్డున ఏకంగా 18 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు అన్నది బృహత్తర కార్యక్రమం. విజయవాడ నడిబొడ్డున ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం అన్నది ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న గట్టి సంకల్పం అని చెప్పాలి. విభజన ఏపీలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఉండాలన్నది గత ప్రభుత్వం ఆలోచన. అయితే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాకా సాకారం చేయడమే కాదు అందుకోసం విజయవాడ నడిబొడ్డున ఏకంగా 18 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అందుకోసం నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అదే విధంగా మూడేళ్ళుగా ఉద్యమ స్థాయిలో పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తూ ఒక్క లెక్కన పరుగులు పెట్టించారు. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులలో అగ్ర స్థానంలో అంబేద్కర్ విగ్రహం ఉంటుందన్నది వాస్తవం.
ప్రపచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ద్వారా జగన్ చిర కీర్తిని ఆర్జించారు. 125 అడుగులు విగ్రహం. దానిని ఏర్పాటు చేసిన పీఠం 81 అడుగులుగా ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ విగ్రహం మొత్తం 206 అడుగులు ఎత్తులో ఉంటుందన్న మాట.
దీనికి అంబేద్కర్ స్మృతి వనం అన్న పేరు పెట్టారు. ఎంత చక్కగా రూపుదిద్దారు అంటే పచ్చని చెట్లతో పాటు రాత్రి వేళ విద్యుత్తు దీపాల కాంతులతో జిగేల్ మనిపించేలా అన్ని వైపులా ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ అడుగు పెడితే చాలు అంబేద్కర్ జీవిత గాధతో పాటు స్పూర్తినిచ్చే రచనలు అలా అనేకమైన పుస్తకాలతో కూడిన లైబ్రరీ కూడా ఇందులో అందుబాటులో ఉండడం విశేషంగా ఉంది.
అలాగే చూసుకుంటే కనుక అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే వివిధ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇలా సర్వాంగ సుందరంగా అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ తో పాటుగా చక్కనైన ప్రాంతంగా దీన్ని ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాలన దగ్గర కావస్తున్న నేపధ్యంలో ఈ విగ్రహావిష్కరణ ఈ ప్రాజెక్ట్ వైసీపీని చాలా ఎత్తులో నిలబెట్టే అవకాశం ఉంది.
అంతే కాదు ఎన్నికల వేళ కూడా ఇది వైసీపీకి ఎంతో ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నా ఎస్టీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని జగన్ ప్రతీ సభలో చెబుతూ ఉంటారు. దానికి ఆచరణాత్మకంగా ఆయన ఏకంగా రాజ్యాంగ నిర్మాతనే అక్కడ ఆవిష్కరించారు. అదే విధంగా సామాజిక న్యాయం పేరిట జగన్ పెద్ద ఎత్తున సీట్లలో బీసీలు ఇతర బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ఇంకా జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్లలేదు. దానికంటే ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ భారీ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయడం ద్వారా శుభప్రదంగా జగన్ జనంలోకి వెళ్ళేందుకు అవకాశం ఏర్పడింది.