నేతలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు!
మరోపక్క ఆ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా పోలీసులకు అందించారని తెలుస్తుంది. ఈ సమయంలో వైఎస్ జగన్ స్పందించారు.
ఏపీలో ఎన్నికల వేళ పలు చోట్ల తీవ్ర అవాంచనీయ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు మొదలైన రచ్చ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరింత వేడెక్కాయని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ సాధించడ, వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగటుకొవడంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయిన పరిస్థితి.
ఈ క్రమంలో అధికారంలోకి వచ్చీ రాగానే తమ కార్యకర్తలు, నేతలపై టీడీపీ జనాలు దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోపక్క ఆ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా పోలీసులకు అందించారని తెలుస్తుంది. ఈ సమయంలో వైఎస్ జగన్ స్పందించారు.
అవును... కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జనాలు.. వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో... వైసీపీ కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడం, వారి వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనులకు టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నారనే వార్తలపై జగన్ సీరియస్ గా స్పందించారు! ఈ సందర్భంగా నాయకులకు కీలక అదేశాలు జారీ చేశారు!
ఇందులో భాగంగా... జరుగుతున్న దాడుల విషయంలో శ్రేణులకు అండగా నిలిచి, భరోసా కల్పించాలని జగన్ నాయకులను ఆదేశించారు. ఈ సమయంలో పార్టీ తరుపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఈ ఘటనలను రాష్ట్రపతి, గవర్నర్ ల దృష్టికి తీసుకెళ్లి పార్టీ తరుపున ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు
ఇదే క్రమంలో వైసీపీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతీ పార్లమెంట్ పరిధిలోనూ కమిటీలు వేయాలని నాయకులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని ఈ సందర్భంగా జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కమిటీలకు సభ్యులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు ఉండనున్నారు.