వైవీకి షాకివ్వ‌నున్న జ‌గ‌న్‌.. గ్రౌండ్ రిపోర్ట్ ఇదే..!

వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్‌కు చిన్నాన్న కూడా.

Update: 2024-08-24 09:30 GMT

వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్‌కు చిన్నాన్న కూడా. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ వైసీపీ ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేసే దిశ‌గా జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) ఎన్నిక‌ల్లో పేల‌వ‌మైన ప‌నితీరు క‌న‌బ‌ర‌చ‌డం. నాయ‌కుల‌తో స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతోపాటు.. క‌య్యాల‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం. పైగా.. నాయ‌కుల‌ను క‌లుపుకొని ముందుకు సాగ‌లేక పోవ‌డం.

2) ఇటీవ‌ల జరిగిన విశాఖ కార్పొరేష‌న్ స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో బ‌లం ఉండి కూడా..చేజేతుతా దీనిని దూరం చేసుకోవ‌డం. క‌నీసం ఇక్క‌డివారిని స‌మ‌న్వ‌యం చేయ‌లేక పోవ‌డంతోపార్టీ ప‌రువుపోయింది. ఇంత మంది ఉండి కూడా పార్టీ స్టాండింగ్ క‌మిటీని ద‌క్కించుకోలేక‌పోయింద‌ని.. స్థానిక నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. దీనికి వైవీనే కార‌ణ‌మ‌ని చాలా మంది చెబుతున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి అమ‌ర్నాథ్ అయితే.. జ‌గ‌న్‌తో అర‌గంట పాటు వివ‌రించార‌ని తెలిసింది.

ఈ క్ర‌మంలో రాజ్య‌స‌భ‌స‌భ్యుడిగా ఉన్న వైవీని ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది. ఆయ‌నకు వేరే బాధ్య‌త‌లు అప్ప‌గించి.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కే ఉత్త‌రాంధ్ర జిల్లాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది. ఇటీవ‌లదువ్వాడ శ్రీనివాస్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచ‌న‌ల మేర‌కే.. మార్పులు చేశార‌న్న‌ది తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టు ఉన్న నాయ‌కుడిగా బొత్స పేరు తెచ్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. పార్టీనిడెవ‌ల‌ప్ చేసేందుకు.. బొత్స అయితే.. స‌రైన నాయ‌కుడ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కే ప‌గ్గాలు అప్ప‌గించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే వైవీ సుబ్బారెడ్డి ఇక త‌ప్పుకోనున్నారు. ఆయ‌న‌ను ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టనున్నార‌న‌ది కూడా స‌మాచారం. పార్టీలో బొత్స ప్రాభ‌వాన్ని పెంచ‌డం ద్వారా.. నాయ‌కుల‌ను కాపాడుకునేందుకుజ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారోచూడాలి.

Tags:    

Similar News