ఔను.. మీ బాధ నాకు తెలుసు: చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి ఓదార్పు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నుంచి భారీ ఓదార్పు లభించింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నుంచి భారీ ఓదార్పు లభించింది. "ఔను.. మీ బాధ నాకు తెలుసు. ఈ వయసులో రాజకీయంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటిని నేను ఖండిస్తాను. ఇలా ఎవరికీ జరగకూడదు. మీరు ధైర్యంగా ఉండండి. అన్నీ అవే సర్దుకుంటాయి. మానసికంగా స్తిరంగా ఉంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అని జగదీప్ ధన్‌ఖడ్.. చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాజాగా సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్.. లూథ్రా కుమారుడికి వివాహ రిసెప్షన్ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్ర మానికి ఏపీ నుంచి చంద్రబాబు కుటుంబానికి ఆహ్వానం అందింది. దీంతో ఆయన సోమవారం ఉదయం భార్యాసమేతంగా.. ఢిల్లీకి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఈ రిసెప్షన్‌కు ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో 5 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడిన జగదీప్ ధన్‌ఖడ్ ఏపీ లో పరిస్థితులపై చర్చించారని టీడీపీ నాయకులు తెలిపారు.
ఇటీవల చంద్రబాబుపై వరుసగా కేసులు పెట్టడం, అరెస్టు చేసి జైల్లో పెట్టడం వంటి విషయాలు తనకు కూడా తెలుసునని జగదీప్ ధన్‌ఖడ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు టీడీపీ నాయకులు తెలిపారు. అయితే.. రాజకీయాల్లో మొక్కవోని ఆత్మవిశ్వాసం ముందు.. ఇవన్నీ చెల్లాచెదరువు అవుతాయని, ముందు ఆరోగ్యంగా ఉండాలని.. అన్నీ సర్దుకుంటాయని ఆయన భరోసా ఇచ్చినట్టు టీడీపీ నాయకులు కనకమేడల రవీంద్రకుమార్ వెల్లడించారు.